అనుపమతో నో.. ఆ హీరోయిన్ ని పెళ్లి చేసుకుంటా? యాటిట్యూడ్ స్టోర్ కామెంట్స్..!
అందులో తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలను కూడా తెలియజేశారు. ఇంటర్వ్యూలో యాంకర్ (అరియాన) హీరో చంద్రహాస్ ను ఒక సరదా ప్రశ్న వేశారు? హీరోయిన్లలో అనుపమ, శ్రీలీల, మృణాల్ ఫోటోలను చూపించి వీరిలో ఎవరో ఒకరితో డేటింగ్, మరొకరితో పెళ్లి, మరొకరిని రిజెక్ట్ చేయండి అంటూ ప్రశ్నించగా? అందుకు చంద్రహాస్ సమాధానాన్ని చెబుతూ అనుపమను రిజెక్ట్ చేస్తాను అంటూ తన యాటిట్యూడ్ స్టార్ ఇచ్చిన ఆన్సర్ కి యాంకర్ అరియానా ఆశ్చర్యపోయింది.
మృణాల్ చాలా పద్ధతిగా అందంగా ఉంటుంది. కాబట్టి ఆమెతోనే తాను డేట్ కు వెళ్తాను, కానీ శ్రీలీలని మాత్రం పెళ్లి చేసుకుంటానని చెప్పారు చంద్రహాస్. ఇందుకు సంబంధించిన ఒక వీడియో క్లిప్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వ్యాఖ్యలు విన్న తర్వాత పలువురు నెటిజన్స్ సైతం చంద్రహాసన్ మరొకసారి ట్రోలింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా అనుపమ ఫ్యాన్స్ అయితే చంద్రహాస్ ని ఆడేసుకుంటున్నారు. అంతేకాకుండా స్టేజ్ మీద చంద్రహాస్ పాడినటువంటి ఒక పాట కూడా తనని విపరీతంగా ట్రోల్ కి గురిచేస్తోంది. మరి ఇన్ని ట్రోల్స్ మధ్య మరొకసారి తన సినిమాని ఏ విధంగా సక్సెస్ చేసుకుంటారో చూడాలి.