మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ పెద్ది ప్లేస్ లో ఉస్తాద్..?

Divya
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరి శంకర్ కాంబినేషన్లో రాబోతున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. పవన్ కళ్యాణ్ కి జోడిగా శ్రీలీల, రాశి ఖన్నా నటిస్తున్నారు. ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్స్, గ్లింప్స్ విడుదల కాగా భారీ రెస్పాన్స్ లభించింది. కానీ ఇప్పటివరకు ఈ సినిమా విడుదల తేదీ పైన మాత్రం ఎటువంటి క్లారిటీ రాలేదు. కానీ మేకర్స్ మాత్రం గతంలో సమ్మర్లో ఈ సినిమాని విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు ప్రకటించారు.


ఇటీవల రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా కూడా మార్చి 27న రావాల్సి ఉండగా వాయిదా పడుతున్నట్లు వినిపిస్తోంది. దీంతో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని ఆ తేదీకి విడుదల చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ పూర్తి కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నట్లు సమాచారం అలాగే ఇటీవల డబ్బింగ్ వర్క్ ను కూడా మొదలుపెట్టారు. ఈ చిత్రానికి సంబంధించి అవుట్ పుట్ పైన ఎక్కడ రాజీ పడకుండా మేకర్స్ చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకున్నారు.


దీన్నిబట్టి చూస్తే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా త్వరలోనే రిలీజ్ కి సిద్ధంగానే ఉంది. కానీ అధికారికంగా మాత్రం చిత్ర బృంద ప్రకటించలేదు. అయితే అలా ప్రకటించకపోవడానికి ముఖ్య కారణం మార్చి నెలలో బడా సినిమాలు విడుదల కాబోతున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్లో భారీ విజయాన్ని అందుకున్న దురంధర్ పార్ట్ 2 మార్చి 19న రిలీజ్ కాబోతోంది. అలాగే హీరో యష్ నటిస్తున్న టాక్సిక్ సినిమా కూడా అదే రోజు రిలీజ్ కాబోతోంది. ఇలా రెండు పెద్ద చిత్రాల అంశాలను పరిశీలించిన తర్వాతే సరైన విడుదల తేదీని ఫిక్స్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్టు సమాచారం. మరి రిలీజ్ డేట్ ఎప్పుడు అనే విషయం పై చిత్ర బృందం క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: