దురంధర్ 2 ది రివెంజర్ టీజర్ రిలీజ్..?

Divya
బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ హీరోగా, డైరెక్టర్ ఆదిత్య ధర్ డైరెక్షన్లో వచ్చిన చిత్రం దురంధర్. ఈ సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీలోనే సరికొత్త రికార్డులను సృష్టించింది. ఏకంగా రూ.1300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇతర దేశాలలో కూడా భారీగా కలెక్షన్స్ రాబట్టడమే కాకుండా ఓటీటిలో కూడా సరికొత్త రికార్డులను తిరగరాస్తోంది. సినిమా థియేటర్లో విడుదలైనప్పుడే రెండవ భాగం కూడా ఉంటుందని ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే మార్చి 19వ తేదీన ఈ సినిమాని విడుదల చేయబోతున్నామంటూ చిత్ర బృందం ప్రకటించారు.


సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా చిత్ర బృందం టీజర్ ని విడుదల చేసింది. "దురంధర్ రివెంజ్"  అంటూ ఈ సినిమాని విడుదల చేయబోతున్నారు. తాజాగా విడుదలైన టీజర్ చాలా ఇంటెన్సీవ్గా సాగుతూ ప్రేక్షకులలో మరింత ఆసక్తిని పెంచేలా కనిపిస్తోంది. ఇందులో కూడా చాలానే డార్క్ అండ్ యాక్షన్ ఎలివేషన్స్ కూడా చూపించారు. రణవీర్ సింగ్ మరొకసారి తన మార్క్ ఎనర్జీతో ఇందులో కనిపిస్తున్నారు. విలన్ గా అక్షయ్ ఖన్నా లుక్ చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తోంది. టీజర్ చూస్తూ ఉంటే దురంధర్ సినిమాలో మిగిలిపోయిన లెక్కలను దురంధర్ ది రివెంజ్ లో సరి చేయబోతున్నట్టు కనిపిస్తోంది.


టీజర్ చివరిలో రణవీర్ సింగ్ చెప్పిన డైలాగ్ ఇది నూతన భారతదేశం.. సరిహద్దులు దాటి ఇంట్లోకి ప్రవేశిస్తుంది.. కచ్చితంగా దెబ్బ కొట్టి తీరుతుంది అంటూ  చెప్పే డైలాగ్ బాగానే ఆకట్టుకున్నట్లు కనిపిస్తోంది. డైరెక్టర్ ఆదిత్య ధర్ కూడా  అద్భుతంగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. మరి దురంధర్ 2 ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందో చూడాలి మరి.గతంలో ఉరి చిత్రాన్ని తెరకెక్కించి మంచి విజయాన్ని అందుకున్న డైరెక్టర్ ఆదిత్య ధర్ ఈసారి సీక్వెల్ ని హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. మొదటి భాగంతోనే సరికొత్త రికార్డులను సృష్టించిన డైరెక్టర్ మరి రెండవ భాగాన్ని ఎలా తెరకెక్కిస్తారని అభిమానులు కూడా చాలా ఎక్సైటింగ్ గానే ఎదురుచూస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: