లవ్ స్టోరీ పై డార్లింగ్ ప్రభాస్ ఇంట్రెస్టింగ్ పోస్ట్.. ఫ్యాన్స్ ఊహించని రిప్లై!
ఈ చిత్రానికి అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహించగా, యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై అజయ్ కుమార్ రాజు ఈ సినిమాను నిర్మించారు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ట్రైలర్‌లో స్పష్టంగా కనిపిస్తూ, సినిమా క్వాలిటీపై మంచి అంచనాలు పెంచుతున్నాయి.ఇదిలా ఉండగా, ఈ మూవీ ట్రైలర్‌పై పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రశంసలు కురిపించడం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రభాస్ తన సోషల్ మీడియా అకౌంట్‌లో స్పందిస్తూ, “కపుల్ ఫ్రెండ్లీ ట్రైలర్ మనసులో నుంచి నేరుగా వచ్చిన ప్రేమ కథలా అనిపిస్తోంది” అంటూ ప్రశంసించారు. అంతేకాకుండా సంతోష్ శోభన్‌తో పాటు ‘కపుల్ ఫ్రెండ్లీ’ టీమ్ మొత్తంకు శుభాకాంక్షలు తెలిపారు.
ప్రభాస్ లాంటి స్టార్ నుంచి వచ్చిన ఈ అభినందనలు సినిమాకు మరింత బజ్ తీసుకొచ్చాయి. అయితే ఇదే సమయంలో ఈ పోస్ట్‌పై నెటిజన్ల నుంచి మిక్స్‌డ్ రియాక్షన్స్ కనిపిస్తున్నాయి. కొందరు అభిమానులు ప్రభాస్ స్పందన చూసి షాక్ అవుతుండగా, మరికొందరు మాత్రం సరదాగా,“మన సినిమాల కంటే పక్కవాళ్ల సినిమాలకే ఎక్కువ ప్రమోషన్స్ చేస్తున్నావు సూపర్ అన్నా” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరు నెటిజన్లు మాత్రం, “ఇతర సినిమాలకు స్టోరీలు పెట్టడం కొంచెం విచిత్రంగా ఉంది, ఇలా చేస్తావనుకోలేదు” అంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ, ప్రభాస్ నుంచి వచ్చిన సపోర్ట్ వల్ల ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమాపై ఆసక్తి మరింతగా పెరిగిందనడంలో ఎలాంటి సందేహం లేదు.మొత్తానికి, యూత్‌ను ఆకట్టుకునే కంటెంట్‌తో, ప్రేమికుల దినోత్సవానికి సరిపోయే టైమింగ్‌లో విడుదలవుతున్న ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి. ట్రైలర్ చూసిన తర్వాత మాత్రం ఈ సినిమా ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుందనే అంచనాలు బలంగా ఏర్పడ్డాయి.