సమంత నిజంగానే అలాంటి పని చేయబోతుందా..? ఫ్యాన్స్ కి బిగ్ షాక్ ఇది..!

Thota Jaya Madhuri
తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాదు, దేశవ్యాప్తంగా భారీ ఫ్యాన్ బేస్ ఉన్న హీరోయిన్లలో సమంత ఒకరు. ఆమె పేరు వినిపిస్తే చాలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ మొదలవుతుంది. అలాంటి సమంత గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన ఒక వార్త అభిమానుల్లో భారీ చర్చకు దారి తీస్తోంది. “సమంత నిజంగానే అలాంటి నిర్ణయం తీసుకోబోతుందా..?” అనే ప్రశ్నతో ఫ్యాన్స్ అంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇటీవల కాలంలో సమంత వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆమె రెండో పెళ్లి గురించి వస్తున్న వార్తలు ఇప్పటికే అభిమానుల్లో ఆసక్తిని రేపాయి. అలాంటి సమయంలో ఇప్పుడు మరో కొత్త టాక్ తెరపైకి రావడం ఇండస్ట్రీలోనూ, సోషల్ మీడియాలోనూ పెద్ద చర్చకు దారి తీస్తోంది. అదేంటంటే… సమంత త్వరలోనే మాతృత్వాన్ని అనుభవించాలనే ఆలోచనలో ఉందట అనే ప్రచారం.

సాధారణంగా సినిమా హీరోయిన్లు తమ కెరియర్ పీక్‌లో ఉన్న సమయంలో పిల్లల గురించి పెద్దగా ఆలోచించరు. కారణం ఏంటంటే .. పెళ్లి, పిల్లలు అన్నాక కెరియర్‌పై ప్రభావం పడుతుందనే భయం చాలామందిలో ఉంటుంది. ముఖ్యంగా ఫిట్‌నెస్, లుక్స్, అవకాశాలు తగ్గిపోతాయేమో అనే ఆందోళనతో చాలామంది హీరోయిన్లు పిల్లల్ని ఆలస్యంగా ప్లాన్ చేస్తారు. కొంతమంది అయితే అసలు ఆ ఆలోచనే పక్కన పెట్టేస్తారు. మరికొంతమంది ఆధునిక పద్ధతులైన సరోగసీ వంటి మార్గాల్ని ఎంచుకుంటూ కెరియర్‌తో పాటు వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకుంటున్నారు.కానీ సమంత మాత్రం ఈ విషయంలో భిన్నంగా ఆలోచిస్తుందట అనే టాక్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆమె కెరియర్ ఎంత బిజీగా ఉన్నా, మాతృత్వాన్ని పూర్తిగా ఆస్వాదించాలని భావిస్తుందట. అందుకే అవసరమైతే కొంతకాలం సినిమాలకు బ్రేక్ తీసుకుని అయినా పిల్లల్ని ప్లాన్ చేయాలనే ఆలోచనలో ఉందని సోషల్ మీడియాలో కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. ఇది నిజమా కాదా అనేది అధికారికంగా ఎక్కడా నిర్ధారణ కాలేదు కానీ, ఈ వార్త మాత్రం జెట్ స్పీడ్‌లో ట్రెండ్ అవుతోంది.

ఈ టాక్ బయటకు వచ్చినప్పటి నుంచి అభిమానుల్లో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. ఒక వర్గం అభిమానులు మాత్రం “సమంత ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఆమె హ్యాపీనెస్‌నే ముఖ్యం” అంటూ సపోర్ట్ చేస్తున్నారు. ఆమె జీవితంలో కొత్త అధ్యాయం మొదలవ్వబోతే అది సెలబ్రేట్ చేయాల్సిన విషయమే అని అంటున్నారు. మరోవైపు ఇంకొంతమంది అభిమానులు మాత్రం కెరియర్ పీక్‌లో ఉన్న సమయంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సరైనదేనా అనే ప్రశ్న లేవనెత్తుతున్నారు. ఇంకా చాలా మంచి పాత్రలు, భారీ సినిమాలు చేసే అవకాశం ఉన్నప్పుడు సినిమాలకు దూరమైతే ఇండస్ట్రీకి నష్టమే కదా అని వారి అభిప్రాయం.ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే – సమంత ఇప్పటివరకు తన వ్యక్తిగత విషయాలపై చాలా స్ట్రాంగ్‌గా, క్లియర్‌గా మాట్లాడిన సందర్భాలున్నాయి. ఆమె జీవిత నిర్ణయాలు ఎప్పుడూ ఆమె చేతుల్లోనే ఉంటాయని, సోషల్ మీడియా టాక్‌ను బట్టి నిర్ణయాలు తీసుకునే వ్యక్తి కాదని చాలాసార్లు నిరూపించింది. అలాంటిది ఇప్పుడు వస్తున్న ఈ వార్తలపై ఆమె ఎలా స్పందిస్తుంది అనేది కూడా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతం సమంత చేతిలో ఉన్న సినిమాలు, వెబ్ సిరీస్ ప్రాజెక్టులు చూసుకుంటే ఆమె కెరియర్ ఇంకా ఫుల్ స్పీడ్‌లోనే ఉన్నట్టు కనిపిస్తోంది. అలాంటి సమయంలో ఈ రకమైన వార్తలు రావడం సహజంగానే షాక్‌కు గురి చేస్తోంది. అయితే సెలబ్రిటీ జీవితాల్లో వ్యక్తిగత నిర్ణయాలపై గాసిప్స్ రావడం కొత్తేమీ కాదు. అందుకే ఇవన్నీ కేవలం ఊహాగానాలేనా, లేక నిజంగానే సమంత ఏదైనా కీలక నిర్ణయం తీసుకోబోతుందా అనే విషయం కాలమే తేల్చాలి.మొత్తానికి ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం సమంత పేరు మరోసారి హాట్ టాపిక్ అయింది. ఇది కొంతమందికి బిగ్ సర్ప్రైజ్ అయితే, ఇంకొంతమందికి మాత్రం షాక్‌గా మారింది. అభిమానులు మాత్రం ఒకటే కోరుకుంటున్నారు – సమంత ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, అది ఆమెకు హ్యాపీనెస్ ఇచ్చేదిగా ఉండాలని. ఇక ఈ వార్తలపై సమంత నుంచి ఎలాంటి క్లారిటీ వస్తుందో, ఆమె నిజంగా ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి అంటే కొంతకాలం వెయిట్ చేయాల్సిందే.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: