మన శంకర వరప్రసాద్ గారు : 22 రోజుల బాక్సాఫీస్ రిపోర్ట్.. ఏకంగా అన్ని కోట్ల లాభాలు వచ్చాయిగా..?

Pulgam Srinivas
మెగాస్టార్ చిరంజీవి తాజాగా మన శంకర వర ప్రసాద్ గారు అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటించాడు. ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణులలో ఒకరు అయినటువంటి నయనతార హీరోయిన్గా నటించగా ... టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. భీమ్స్ సిసిరిలీయో సంగీతం అందించిన ఈ సినిమాను షైన్ స్క్రీన్ , గోల్డ్ బాక్స్ బ్యానర్ల పై సాహు గారపాటి , సుష్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీ ని జనవరి 12 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేశారు. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన 22 రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ 22 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్స్ ఎన్ని ..? లాభాలు ఎన్ని ..? అనే వివరాలను క్లియర్ గా తెలుసుకుందాం.

22 రోజుల్లో ఈ సినిమాకు నైజాం ఏరియాలో 45.97 కోట్ల కలెక్షన్లు దక్కగా , సిడెడ్ లో 22.68 కోట్లు , ఉత్తరాంధ్ర లో 22.29 కోట్లు , ఈస్ట్ లో 15.60 కోట్లు , వెస్ట్ లో 9.92 కోట్లు , గుంటూరు లో 11.18 కోట్లు , కృష్ణ లో 10.91 కోట్లు , నెల్లూరులో 6.75 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా 22 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ మూవీ కి 145.30 కోట్ల షేర్ ... 222.85 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఇక 22 రోజుల్లో ఈ మూవీ కి కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలుపుకొని 13.45 కోట్లు , ఓవర్సీస్ లో 19.36 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా 22 రోజుల్లో ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 178.11 కోట్ల షేర్ ... 292.85 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా 120.70 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 122 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరి లోకి దిగింది. ఈ సినిమా ఇప్పటికే బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని ఇప్పటికే 56.11 కోట్ల లాభాలను అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: