పోలీస్ స్టేషన్ మెట్లేక్కిన టాలీవుడ్ హీరోయిన్.. వేధింపులే కారణమా..?

Divya
ఈ మధ్యకాలంలో సెలబ్రెటీలకు సంబంధించి మార్ఫింగ్ ఫోటోల వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో కొన్నిసార్లు కోర్టు, పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అలా ఇప్పటికి చాలామంది సెలబ్రిటీలు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోగా తాజాగా టాలీవుడ్ హీరోయిన్ ఈషా రెబ్బ కూడా ఆన్లైన్ హెరాస్మెంట్ మితిమీరిపోవడంతో ధైర్యంగా ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. తన ఇస్టాగ్రామ్ పోస్టుల కింద అసభ్యకరమైన కామెంట్స్ చేసిన ఒక వ్యక్తి పై చర్యలు తీసుకోవాలని బంజారాహిల్స్ లో పోలీస్ స్టేషన్కు వెళ్లి మరి ఫిర్యాదు చేసింది.


తన ఇస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు, వీడియోలకు సంబంధించి ఒకరు చాలా అసభ్యకరంగా అనైతికంగా కామెంట్స్ చేస్తున్నారని, పోలీసులకు ఫిర్యాదు చేసింది ఈషా రెబ్బ. ఆ కామెంట్స్ చేసిన వ్యక్తికి సంబంధించి ఇన్స్టా ఐడి, ఇతర వివరాలు అతను చేసిన కామెంట్స్ స్క్రీన్ షాట్లను కూడా ఫిర్యాదుతో జత చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పోలీసులు కూడా తెలుపుతూ హీరోయిన్ ఇచ్చిన కంప్లైంట్ పైన దర్యాప్తును వేగవంతం చేస్తున్నామని తెలిపారు. ఈ విషయం తెలిసిన అభిమానులు, నెటిజెన్స్ సైతం సోషల్ మీడియా వేదికగా మద్దతుగా నిలుస్తున్నారు ఈషా రెబ్బకు.


ఇటీవలే ఈషా రెబ్బ నటించిన ఓం శాంతి శాంతి శాంతిః చిత్రం ప్రేక్షకుల ముందుకు రాగా పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో ఆమె నటనకు  మంచి మార్కులే పడ్డాయి. మలయాళ ఇండస్ట్రీలో చిన్న సినిమాగా విడుదలైన జయ జయ జయ జయహే చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసి విడుదల చేశారు. ఈ చిత్రంలో తరుణ్ భాస్కర్ కి జోడిగా నటించింది ఈషా రెబ్బ. గత కొద్దిరోజులుగా తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంపై ఎవరు క్లారిటీ ఇస్తారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: