ఇండస్ట్రీలో విషాదం..క్యాన్సర్ తో బుల్లితెర నటి మృతి.. !
కరాటే కళ్యాణిఫేస్ బుక్ లో ఇలా రాసుకుంటూ.. వాహిని అక్క నిన్ను కాపాడుకోవాలని చాలా ప్రయత్నం చేశాను, కానీ అది సాధ్యపడలేదు. కొద్దిసేపటి క్రితం తన జన్మస్థలమైన విజయనగరంలో స్వామిని చేరుకుంది.. వైద్యులు కూడా మొన్న చెప్పేశారు, ఇక కష్టమని దీంతో కుటుంబ సభ్యులు ఊరికి తీసుకెళ్లిపోయారంట.. ఆమె పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను అంటూ నిన్ను చాలా మిస్ అవుతున్నాం పద్మక్క.. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్న అంటూ ఫేస్ బుక్ లో ఒక నోట్ రాసుకొచ్చింది కరాటే కళ్యాణి. ఈ విషయం విన్న పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఈమెకు సంతాపం తెలియజేస్తున్నారు.