విశ్వంబర మేకర్స్ ఆ సూపర్ సెంటిమెంట్ను ఫాలో కానున్నారా..?

Pulgam Srinivas
విశ్వంబర మేకర్స్ ఆ సూపర్ సెంటిమెంట్ను ఫాలో కానున్నారా..?

మెగాస్టర్ చిరంజీవి చాలా కాలం  క్రితమే మల్లాడి  వశిష్ఠ దర్శకత్వం లో విశ్వంభర అనే మూవీ ని మొదలు పెట్టాడు . ఈ  సినిమాను స్టార్ట్ చేసిన కొద్దీ రోజులకే ఈ  మూవీ ని 2025 సంక్రాంతి కి విడుదల చేయనున్నట్లు కూడా ప్రకటించారు . ఇకఈ  సినిమాకి బారి గ్రాఫిక్స్ పనులు ఉన్నాయని అవి అనుకున్న టైం కి పూర్తి కావడం లేదు అని ఈ  సినిమాని 2025 సంక్రాంతి కి కాకుండా వేరే సమయములో విడుదల చేస్తాము అని మేకర్స్ ప్రకటించారు . ఆ తర్వాత కొన్ని రోజులకి ఈ  సినిమాని 2026 సమ్మర్ కానుకగా విడుదల చేయనున్నాము అని చిరంజీవి అధికారికంగా ప్రకటించాడు.


దానితో ఈ  సినిమాను ఈ  ఇయర్ మే లో విడుదల చేసే అవకాశం ఉంది అని చాల మంది అభిప్రాయ పడ్డారు. ఇక ప్రసుత పరిస్థితులను  బట్టి చుస్తే ఈ మూవీ ఈ  సమ్మర్ లో కూడా విడుదల కావడం కష్టం అని తెలుస్తుంది. ఈ మూవీ ని ఈ  సమ్మర్ లో రిలీజ్ చేయకపోయినా కూడా మెగా ఫామిలీ కి సూపర్ గా  కలిసి వచ్చిన నెలలో ఈ సినిమాను రిలీజ్ చేయాలనే ప్లాన్ లో ఈ మూవీ మేకర్స్ ఉన్నట్లు తెలుస్తుంది. జులై నెలలో విడుదల అయినా ఎన్నో మెగా హీరోల మూవీలు మంచి విజయాలను సాధించాయి. ఇక విశ్వంభర మూవీ ని కూడా   ఈ జులై 10 వ తేదీన విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇక విశ్వంభర మూవీ తర్వాత చిరంజీవి మన శంకర వార ప్రసాద్ మూవీని మొదలు పెట్టాడు. ఈ  మూవీ ని తాజాగా విడుదల అయ్యి మంచి విజయాన్ని అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: