డైరెక్టర్ మెహర్ రమేష్ ఇంట విషాదం..?
మా అమ్మ వెంకట సుబ్బమ్మ గారు 2003 ఫిబ్రవరి 7వ తేదీన మరణించారు. ఇప్పుడు సరిగ్గా అదే తేదీన మా అత్తమ్మ గారికి ఆఖరి వీడ్కోలు ,మా అత్తమ్మ పద్మావతి మరణం మా కుటుంబానికి తీరనిలోటు ఓం శాంతి అంటూ తన అత్తమ్మకు నివాళులు అర్పించారు మెహర్ రమేష్. ఈ విషయం తెలిసిన పలువురు సినీ సెలబ్రెటీలు, అభిమానులు, నేటిజెన్స్ సైతం మెహర్ రమేష్ అత్తమ్మకు నివాళులు అర్పిస్తున్నారు. టాలీవుడ్లో బడ హీరోలతో సినిమాలు తెరకెక్కించిన సక్సెస్ కాలేకపోయినా మెహర్ రమేష్ కన్నడలో మాత్రం ఆంధ్రావాలా, ఒక్కడు చిత్రాలను రీమేక్ చేసి మంచి విజయాలను అందుకున్నారు.
టాలీవుడ్ లో ఎన్టీఆర్ కంత్రి సినిమాతో అడుగుపెట్టిన మెహర్ రమేష్ ఆ తర్వాత ప్రభాస్ తో బిల్లా సినిమాని తెరకెక్కించగా ఫ్యాన్స్ ని బాగానే ఆకట్టుకుంది. ఆ తర్వాత డైరెక్టర్ మెహర్ రమేష్ చేసిన సినిమాలన్నీ కూడా భారీ ఫ్లాప్ గా మిగిలాయి. చివరిగా చిరంజీవితో కలిసి భోళా శంకర్ సినిమాని తెరకెక్కించగా ఈ సినిమా కూడా ఘోరంగా డిజాస్టర్ అవడంతో పెద్దగా బయట ఎక్కడ కనిపించలేదు. మెగా ఫ్యామిలీకి దగ్గర బంధు కావడం చేత అప్పుడప్పుడు ఏదో ఒక సినిమా ఈవెంట్ లో కనిపిస్తూ ఉండేవారు. మరి రాబోయే రోజుల్లో ఏదైనా మంచి సినిమాతో వస్తారేమో చూడాలి.