బాలకృష్ణ: సినిమా స్టోరీ మార్చేసిన డైరెక్టర్.. ఈసారి ముంబై ..!
అయితే మొదట ఈ సినిమా కోసం డైరెక్టర్ ఒక చారిత్రాత్మకమైన కథని ఎంచుకున్నారు. హీరోయిన్గా నయనతార కూడా ఫిక్సయినట్లు వినిపించాయి. అయితే బడ్జెట్ కారణాలవల్ల ఈ సినిమాని పూర్తిగా పక్కన పెట్టి సరికొత్త కథతో సినిమా చేయబోతున్నట్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమా స్టోరీ ముంబై నేపథ్యంలో సాగే మాస్ ఎలివేషన్స్ సాగే పాత్రతో పాటు యాక్షన్ ఎంటర్టైన్మెంట్గా ఉండనున్నట్లు సమాచారం. బాలకృష్ణ ఈ మధ్య ఎక్కువగా ద్విపాత్రాభినయంగా నటిస్తున్నారు. కానీ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో కేవలం ఒకే పాత్రలు కనిపించబోతున్నారు. అన్ని అనుకూలిస్తే ఈ సినిమా 2026 మార్చి మొదటి వారం నుంచే షూటింగ్ మొదలుపెట్టే అవకాశం ఉన్నట్లు వినిపిస్తున్నాయి.
అంతేకాకుండా బాలకృష్ణతో సినిమాలు చేయడానికి మరి కొంతమంది దర్శక, నిర్మాతలు వెంటపడుతున్నట్లు వినిపిస్తోంది. ముఖ్యంగా మార్కో సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న డైరెక్టర్ హనీఫ్ అదేని దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా ఒక సినిమా రాబోతున్నట్లు సమాచారం. ఆ తర్వాత డైరెక్టర్ హరిశంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేసే అవకాశం ఉన్నదట. మరొక డైరెక్టర్ వివేక ఆత్రేయ కూడా బాలయ్య డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. మరో నిర్మాత సూర్యదేవర నాగవంశీ కూడా బాలకృష్ణతో ఒక సినిమా చేసే అవకాశం ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్నాయి. మొత్తానికి బాలయ్యతో సినిమా చేయడానికి చాలామంది దర్శకుల పేర్లు అయితే వినిపిస్తున్నాయి.