పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మనసు హర్ట్ చేసే రూమర్..ఇలా తయారు అయ్యారు ఏంట్రా బాబు..?!

Thota Jaya Madhuri
తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటుడిగా మాత్రమే కాకుండా వ్యక్తిత్వం, ఆలోచనా విధానం, ప్రజలతో కలిసిపోయే స్వభావం వల్ల ఆయనకు అభిమానుల్లో ప్రత్యేకమైన స్థానం ఏర్పడింది. ఆయన సినిమా విడుదలవుతుందంటే అభిమానుల్లో ఒక ప్రత్యేకమైన ఉత్సాహం కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ సినిమాల్లో సాధారణంగా ఒక ప్రత్యేకత, కొత్తదనం లేదా సందేశం ఉండటం వల్ల ప్రతి వర్గం ప్రేక్షకుడిని థియేటర్‌కి రప్పించే శక్తి ఆయనకు ఉంది అని చెప్పటంలో సందేహం .

అయితే ఇంతటి ప్రజాదరణ ఉన్న వ్యక్తి గురించి అప్పుడప్పుడు కొన్ని గాసిప్‌లు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా ఆయన వ్యక్తిగత సంబంధాల గురించి వచ్చే వార్తలు అభిమానులను బాధపెడుతుంటాయి. ప్రస్తుతం కూడా పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది నటులతో మాట్లాడటం లేదనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. కానీ పవన్ కళ్యాణ్ స్వభావాన్ని గమనిస్తే, ఆయన వ్యక్తిగతంగా ఎవ్వరితోనూ గొడవ పడే వ్యక్తి కాదని చాలామంది చెబుతారు. ప్రొఫెషనల్‌గా ప్రతి ఒక్కరూ తమ పని చేసుకుంటూ ముందుకు సాగాలని ఆయన నమ్మకం.

ఇలాంటి పరిస్థితుల్లో ఆయనకు చాలా సన్నిహితుడిగా భావించే నటుడు అలీ రాజకీయంగా వైసీపీ పార్టీలో చేరడం ఒక పెద్ద చర్చకు దారితీసింది. రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత అలీ చేసిన కొన్ని వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ అభిమానుల్లో అసంతృప్తిని కలిగించాయని అంటున్నారు. ఈ కారణంగా ఇద్దరి మధ్య దూరం ఏర్పడిందనే ప్రచారం జరుగుతోంది. గతంలో వీరిద్దరి స్నేహం ఇండస్ట్రీలో ఎంతో ప్రసిద్ధి చెందింది. అనేక సినిమాల్లో కలిసి నటించి ప్రేక్షకులను అలరించారు. కొంతమంది అభిప్రాయం ప్రకారం, అలీ పవన్ కళ్యాణ్‌తోనే కొనసాగి ఉంటే ఆయన కెరీర్‌లో మరింత మంచి అవకాశాలు వచ్చి ఉండేవని అంటున్నారు. రాజకీయాల్లో కూడా వేరే విధంగా ఎదిగే అవకాశం ఉండేదని విశ్లేషిస్తున్నారు అనే మాటలు వినిపిస్తున్నాయి. అయితే ఇవన్నీ వ్యక్తిగత అభిప్రాయాలే తప్ప స్పష్టమైన ఆధారాలు లేవు.

ఏది ఏమైనా, పవన్ కళ్యాణ్‌కు అత్యంత సన్నిహితుడిగా భావించిన అలీ వేరే రాజకీయ పార్టీని ఎంచుకోవడం పవన్ కళ్యాణ్‌కు కొంత అసౌకర్యంగా అనిపించి ఉండొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందుకే ప్రస్తుతం ఇద్దరూ ఎక్కువగా మాట్లాడుకోవడం లేదనే వార్తలు అప్పుడప్పుడు బయటకు వస్తుంటాయి.అయితే సినీ పరిశ్రమలోనైనా, రాజకీయాల్లోనైనా సంబంధాలు కాలానుగుణంగా మారడం సహజం. వ్యక్తిగతంగా వారు ఒకరిపై ఒకరు గౌరవం కలిగి ఉండే అవకాశమే ఎక్కువ అని కూడా చాలామంది భావిస్తున్నారు. అభిమానులు మాత్రం భవిష్యత్తులో మళ్లీ ఈ ఇద్దరు కలిసి కనిపించాలని ఆశిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: