నిజంగా అదే కనుక జరితే "వారణాసి" కలెక్షన్స్ ఊహాతీతం..చరిత్ర తిరగరాసిన్నట్టే..!
చివరికి ఒక ప్రత్యేక విధానాన్ని ఎంచుకున్నామని ఆయన చెప్పారు. “వారణాసి” సినిమా ప్రధానంగా ‘1.90:1’ స్కోప్ ఫార్మాట్లో ఉంటుంది. అయితే ఐమ్యాక్స్ స్క్రీన్స్‌లో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు ‘1.43:1’ నిజమైన ఐమ్యాక్స్ ఫార్మాట్లో ప్రదర్శించబడతాయి. ఏ సన్నివేశాన్ని ఏ ఫార్మాట్లో చూపించాలి అనేది ఇప్పటికీ ఒక సవాల్‌గా ఉంది అని రాజమౌళి వివరించారు. ఇంకా మాట్లాడుతూ, రెండు ఫార్మాట్ల షాట్లను కలిపేయాలని టెక్నికల్ టీమ్ సూచించినప్పటికీ, అలా చేస్తే సహజత్వం తగ్గిపోతుందని తాను భావించానని చెప్పారు. దానికి బదులుగా, ప్రేక్షకులకు నిజంగా ఐమ్యాక్స్ అనుభూతి కలిగేలా సినిమాను రూపొందించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని తెలిపారు.
మన దేశంలో ఐమ్యాక్స్ స్క్రీన్స్ తక్కువగా ఉన్నప్పటికీ, ఓవర్సీస్ మార్కెట్లో ఈ ఫార్మాట్ విస్తృతంగా అందుబాటులో ఉంది. సరైన సినిమా వస్తే, అక్కడి నుంచి వచ్చే కలెక్షన్లు నిజంగా ఊహాతీతంగా ఉండే అవకాశముంది. మహేశ్ కెరియర్ లోనే ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది అని అందరికి తెలిసిందే. ఈ సినిమా ప్రియాంక చోప్రా మందాకిని అనే పాత్రలో కనిపించబోతుంది..!!