హైదరాబాదులో సమావేశమైన అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్.. కారణం..?
రాబోయే రోజులలో రెండు తెలుగు రాష్ట్రాలలో అటు జిల్లాల మండల టౌన్ స్థాయిలో కూడా కమిటీలను ఏర్పాటు చేయడానికి ప్రణాళికను ప్రారంభించారు. అలాగే ఈ సమావేశంలో ఎంచుకున్న ప్రతినిధులలో వారి యొక్క బాధ్యతలను వివరించినట్టుగా తెలుస్తోంది. అలాగే చేపట్టిన కార్యక్రమాలకు కూడా సమర్థవంతంగా క్రమబద్ధంగా నిర్వహించేలా ఉండాలని తెలియజేశారు. రాష్ట్రస్థాయి కమిటీతో పాటు , జిల్లాల వారీగా కమిటీలను ఏర్పాటు చేసి అల్లు ఫాన్స్ అసోసియేషన్ ద్వారా భవిష్యత్తులో పలు సేవా కార్యక్రమాలను ప్రజల ముందుకు తీసుకు వెళ్లడానికి ఈ కమిటీ కీలకమైన పాత్ర పోషిస్తుంది అంటూ అసోసియేషన్ నాయకులు తెలియజేశారు.
ముఖ్యంగా అల్లు అర్జున్ గారి ప్రతిభ క్రమశిక్షణను విలువలను సైతం ప్రతిబింబించే విధంగా ఫాన్స్ అసోసియేషన్ పలు రకాల కార్యక్రమాలు చేపట్టాలని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి గ్రూప్ ను కూడా మైంటైన్ చేయబోతున్నట్లు తెలియజేశారు. అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో సినిమా అనౌన్స్మెంట్ చేశారు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలు కాబోతోంది. ఇందులో హీరోయిన్గా దీపికా పదుకొనే నటించగా భారీ బడ్జెట్లోనే పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఆ తర్వాత డైరెక్టర్ లోకేష్ కనకరాజు తో ఒక సినిమా , సుకుమార్ తో పుష్ప 3 సినిమా చేయబోతున్నట్లు సమాచారం.