2027: సంక్రాంతి బరిలో టాలీవుడ్ సీనియర్స్.. ఎవరెవరంటే.. ?

Divya
టాలీవుడ్ లో సీనియర్ హీరోలు అనగానే అందరికీ మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ ,వెంకటేష్ పేర్లు గుర్తుకొస్తాయి. ఈ సీనియర్ హీరోలకు ఫాన్స్ కూడా ఏ రేంజ్ లో ఉన్నారో చెప్పాల్సిన పనిలేదు. అందుకే ఈ హీరోల సినిమాలు ఎప్పుడు వచ్చినా కూడా ఫ్యామిలీ ఆడియన్స్, అభిమానులు సినిమాలను ఎగబడి చూస్తారు. అయితే ఈ నలుగురు హీరోల సినిమాలు ఒకే సీజన్లో విడుదల కావడం చాలా రేర్ గా ఉంటుంది.ఇప్పుడు తాజాగా ఆ ఊహ నిజం కాబోతున్నట్లు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.


ఒకే సీజన్లో తమ సినిమాలను థియేటర్లోకి తీసుకువచ్చేలా చూస్తున్నారట. ఆ సీజన్ ఏదో కాదు 2027 సంక్రాంతి సీజన్. ఈ నలుగురు సీనియర్ హీరోలు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ముందుగా మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబి దర్శకత్వంలో సినిమా అనౌన్స్మెంట్ చేయక ఈ సినిమా పైన అంచనాలు కూడా పెరిగిపోయాయి. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కాబోతున్నది. 2027 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.

నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో మరో మాస్ ఎంటర్టైన్మెంట్ సినిమా రాబోతోంది. నాగార్జున , డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణకురపాల దర్శకత్వంలో రాబోతున్న సినిమాని కూడా సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటన చేశారు. అలాగే విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్లో నాలుగవసారి సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకే రాబోతున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలు కాబోతోంది.


ఇలా మొత్తానికి టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు సైతం సంక్రాంతి సీజన్ లో తమ సినిమాలను విడుదల చేయబోతున్నారు. ఒకవేళ అన్ని అనుకున్నట్టుగా జరిగి సంక్రాంతి కానుకగా ఈ సినిమాలు విడుదల అయితే టాలీవుడ్ హిస్టరీ లోనే మొదటిసారి ఈ ఫిట్ అందుకున్న హీరోలుగా పేరు సంపాదిస్తారు. మరి బాక్స్ ఆఫీస్ లెక్కలు కూడా ఎలా ఉంటాయో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: