‘పెద్ది’ విషయంలో మెగా ఫ్యాన్స్ కి న్యూ టెన్షన్ స్టార్ట్..మ్యూజిక్ వర్క్ ఆపేసిన AR రెహమాన్..ఏమైందంటే..?

Thota Jaya Madhuri
దర్శకుడు బుచ్చి బాబు తెరకెక్కిస్తున్న పెద్ది చిత్రానికి సంబంధించిన పనులు ప్రస్తుతం వేగంగా కొనసాగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే సినిమా ఫస్ట్ హాఫ్‌ను ఎడిటింగ్‌తో సహా పూర్తిగా లాక్ చేసినట్లు తెలిసింది. ఇటీవలే చిత్రంలోని క్లైమాక్స్ షూటింగ్ కూడా విజయవంతంగా పూర్తయింది, దానికి సంబంధించిన ఎడిటింగ్ పనులు కూడా పూర్తి చేసినట్లు టాక్ వినిపిస్తోంది.ఇప్పుడు సినిమా పోస్ట్-ప్రొడక్షన్‌లో ముఖ్యమైన బాధ్యత మొత్తం సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్ పై పడింది. ఈ చిత్రానికి సంబంధించిన రీ-రికార్డింగ్ పనుల కోసం ఫస్ట్ హాఫ్‌ను వారం రోజుల క్రితమే రెహమాన్‌కు పంపినట్లు సమాచారం. అయితే ఇప్పటివరకు ఆ పనులు ప్రారంభం కాలేదని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఇదిలా ఉండగా, ఈ నెల 18 నుండి రంజాన్ మాసం ప్రారంభం కానుండటంతో ఆ సమయంలో రెహమాన్ సాధారణంగా కొత్త పనులు చేపట్టరని చెబుతున్నారు. ఆ కారణంగా ఆయన మళ్లీ పూర్తి స్థాయిలో పని ప్రారంభించడానికి సుమారు నెల రోజుల సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 18 లోపు అయినా కొంత రీ-రికార్డింగ్ పనిని పూర్తి చేయించాలని దర్శకుడు బుచ్చి బాబు ప్రయత్నిస్తున్నాడని సమాచారం.మరోవైపు, ఈ సినిమాకు సంబంధించిన చివరి షెడ్యూల్ ఎలాంటి విరామం లేకుండా కొనసాగుతోంది. హీరో రామ్ చరణ్ రెగ్యులర్‌గా షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ఇంకా సుమారు నెలకు పైగా షూటింగ్ బ్యాలన్స్ ఉందని తెలుస్తోంది.

ప్రారంభంలో ఈ చిత్రాన్ని మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయాలని నిర్మాతలు భావించారు. అయితే ప్రస్తుతం మిగిలి ఉన్న షూటింగ్ మరియు పోస్ట్-ప్రొడక్షన్ పనులను దృష్టిలో పెట్టుకుని విడుదల తేదీని ఏప్రిల్ 30కి వాయిదా వేసినట్లు సమాచారం.అయితే షూటింగ్ పూర్తవడం, రీ-రికార్డింగ్ పనులు సమయానికి ముగియడం వంటి అంశాలపై విడుదల ఆధారపడి ఉంటుంది. అన్ని పనులు ప్లాన్ ప్రకారం పూర్తైతే చెప్పిన తేదీన సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. లేకపోతే మరో కొత్త విడుదల తేదీని నిర్ణయించే పరిస్థితి కూడా రావచ్చు.మొత్తానికి, ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు సంబంధించిన పనులు చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో తదుపరి అప్‌డేట్స్ ఎలా ఉండబోతున్నాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: