బాలకృష్ణ పై.. టాలీవుడ్ హీరోయిన్ క్రేజీ కామెంట్స్..!

Divya
టాలీవుడ్లో ఒకప్పుడు హీరోయిన్గా పలు చిత్రాల్లో నటించి అద్భుతమైన పాపులారిటీ సంపాదించుకుంది హీరోయిన్ లయ. చాలా సంవత్సరాల పాటు సినిమాలకు దూరంగా ఉంటూ అమెరికాలో సెటిలైన లయ నిరంతరం సోషల్ మీడియాలో తన డాన్సులతో ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఉండేది. నితిన్ నటించిన తమ్ముడు సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన లయ, ఆ తర్వాత వరుస పెట్టి పలు చిత్రాలలో నటిస్తోంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నందమూరి బాలకృష్ణ పైన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.


నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రాలలో విజయేంద్ర వర్మ కూడా ఒకటి. ఈ చిత్రంలో లయ కూడా నటించింది. అయితే ఆ సమయంలో బాలకృష్ణ గారి తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంది. లయ మాట్లాడుతూ బాలకృష్ణ గారు సినిమా సెట్ లో ఉన్నారంటే ఆ ఎనర్జీనే వేరు, ఆయన చాలా క్రమశిక్షణగానే ఉంటారు. అదే సమయంలో తన తోటి నటీనటులతో కూడా చాలా సరదాగా ఉంటూ జోకులు వేస్తూ అందరిని నవ్విస్తుంటారని తెలియజేసింది. అందుకే అలాంటి వారితో కలిసి పనిచేయడం తనకు దొరికిన ఒక గొప్ప అవకాశం అంటూ తెలిపింది.


ఒకవేళ మళ్లీ అలాంటి అవకాశాలు వస్తే మాత్రం వదులుకోనని చెప్పుకొచ్చింది. దీంతో లయ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో బాలయ్య అభిమానుల వైరల్ గా చేస్తున్నారు. అభిమానులు కూడా అందుకే హీరోయిన్స్ సైతం బాలకృష్ణతో నటించాలని కోరుకుంటారంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో లయ బాలయ్యతో నటించే అవకాశం వస్తుందేమో చూడాలి మరి. లయ చివరిగా బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం సినిమాలో నటించిన ఆ తర్వాత 8 ఏళ్లకు అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో తల్లి పాత్రలో నటించింది. 2025లో నితిన్ నటించిన తమ్ముడు సినిమాలో కనిపించిన లయ ఇప్పుడు సాంప్రదాయని సుప్పిని సుద్ధపూసని చిత్రంలో నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: