పవన్ కళ్యాణ్ సినిమాలో రౌడీ హీరో.. నిజమెంత..?

Divya
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్లో సినిమా రాబోతోందని గత కొద్దిరోజులుగా వార్తలైతే వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని రామ్ తుల్లూరి నిర్మించబోతున్నారు. అయితే ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో స్టార్ హీరోని నటింపజేసేందుకు చిత్ర బృందం సంప్రదించారనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆ హీరో ఎవరో కాదు విజయ్ దేవరకొండ అని టాలీవుడ్ లో గుసగుసలు కనిపిస్తున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి తమ్ముడి పాత్రలో విజయ్ కనిపించబోతున్నట్లు వినిపిస్తున్న ఈ వార్తలలో నిజం ఎంత ఉందని అభిమానులు ఆరా తీయడం మొదలుపెట్టారు.


కానీ వినిపిస్తున్న సమాచారం ప్రకారం హీరో విజయ్ దేవరకొండ ఈ ప్రాజెక్టులో భాగం కాలేదని తెలుస్తోంది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం తన చేతిలో ఉన్న నాలుగు భారీ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి సిద్ధమవుతున్నారు. డైరెక్టర్ రవి కిరణ్ కోలా దర్శకత్వంలో రౌడీ జనార్ధన్ సినిమా షూటింగ్ జరుగుతోంది. అలాగే రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో  మైత్రి మూవీస్ బ్యానర్ పైన  పీరియాడికల్ యాక్షన్ చిత్రం రణబాలి కూడా షూటింగ్ దశలో ఉంది. ఇవే కాకుండా మరికొన్ని చిత్రాలు కూడా ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్నట్లు సమాచారం.


ఇప్పటికే రెండు చిత్రాలకు సంబంధించి షూటింగ్ స్టేజ్ లో ఉండగా విజయ్ తన సమయాన్ని పూర్తిగా తన సినిమాలకే కేటాయించే పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సమయంలో విజయ్ దేవరకొండ డేట్లు సర్దుబాటు చేయడం కూడా అసాధ్యం అన్నట్టుగా వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ సినిమాలో విజయ్ దేవరకొండ నటించేందుకు చిత్ర బృందం సంప్రదించారనే వార్తలు కేవలం రూమర్స్ మాత్రమే. విజయ్ దేవరకొండ ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేయాలని దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. మరి ఒకే ఫ్రేమ్ లో, విజయ్ దేవరకొండ, పవన్ కళ్యాణ్ కనిపిస్తారో లేదో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: