ఓరి దేవుడోయ్..బన్నీ అలా చేయబోతున్నాడా..? ఒకే ఒక్క నిర్ణయం తో కెరీర్ ని రిస్క్ లో పెట్టుకుంటున్నాడే..?!
అదే సమయంలో మరో తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో కూడా అల్లు అర్జున్ ఒక సినిమా చేస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. కమర్షియల్ ఎలిమెంట్స్, ఎమోషన్, గ్రాండ్ విజువల్స్ కలిపి అట్లీ రూపొందించే సినిమాలు సాధారణంగా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు సాధిస్తాయి. అందుకే ఈ ప్రాజెక్ట్‌పై కూడా ఇండస్ట్రీలో మంచి ఆసక్తి నెలకొంది.ఇలాంటి భారీ ప్రాజెక్టుల తర్వాత అల్లూ అర్జున్ ఏ దర్శకుడితో సినిమా చేయబోతున్నాడు అనే ప్రశ్న ఇప్పుడు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఈ నేపథ్యంలో దర్శకుడు బోయపాటి శ్రీను పేరు వినిపించడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.
గతంలో అల్లు అర్జున్–బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన “సరైనోడు” సినిమా ఎంత పెద్ద కమర్షియల్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమా మాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. యాక్షన్, ఎమోషన్, కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ కలిసిన ఆ చిత్రం అల్లు అర్జున్ కెరీర్లో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. అయితే ఆ సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో మరో చిత్రం రాలేదు.కానీ అప్పట్లోనే “మంచి కథ తీసుకువస్తే తప్పకుండా మీతో మరో సినిమా చేస్తాను” అని అల్లు అర్జున్.. బోయపాటి శ్రీనుకు మాట ఇచ్చాడని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ ఉంది. ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకునే దిశగా పరిణామాలు జరుగుతున్నట్టు సమాచారం.
తాజాగా బోయపాటి శ్రీను ముంబైకి వెళ్లి అల్లు అర్జున్ను కలుసుకుని ఒక కథను వినిపించాడని తెలుస్తోంది. ఆ కథ అల్లు అర్జున్‌కు కూడా నచ్చిందని, పూర్తి స్థాయి స్క్రిప్ట్‌ను సిద్ధం చేయాలని ఆయన సూచించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకా అధికారిక ప్రకటన ఏదీ లేకపోయినా ఈ వార్త సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది.ఈ వార్త బయటకు వచ్చిన వెంటనే అభిమానుల్లో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. బోయపాటి శ్రీను ఒక మంచి కమర్షియల్ మాస్ దర్శకుడు అన్న విషయంలో ఎలాంటి సందేహం లేకపోయినా, ప్రస్తుతం ఆయన ఫామ్‌లో లేరని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఇటీవల వచ్చిన ఆయన సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడం అభిమానులను ఆలోచనలో పడేసింది. మొత్తానికి ఈ కాంబినేషన్ గురించి వస్తున్న వార్తలు మాత్రం ఇండస్ట్రీలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.