ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో విలన్ గా ఎవరు నటిస్తున్నారో తెలుసా..?

Divya
టాలీవుడ్ లో స్టార్ హీరోగా పేరు సంపాదించిన పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. ఇందులో హీరోయిన్గా శ్రీలీల, రాశి ఖన్నా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మార్చి 26వ తేదీన విడుదల చేయబోతున్నారు. దీంతో చిత్ర బృందం వరుసగా ప్రమోషన్స్ ని మొదలుపెట్టింది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి సాంగ్స్ కూడా విడుదల చేసింది. త్వరలోనే ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే వరుసగా ఈ చిత్రంలో నటించే నటీనటుల పాత్రలకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్లను విడుదల చేస్తున్నారు.


తాజాగా ఈ చిత్రంలో విలన్ పాత్రను పరిచయం చేస్తూ ఒక అదిరిపోయే పోస్టర్ ను విడుదల చేశారు. ఈ చిత్రంలో యుగానికి ఒక్కడు సినిమాలో నటించిన పార్తిబన్ సంబంధించి ఫస్ట్ లుక్ ని మేకర్స్ అధికారికంగా విడుదల చేశారు. ఈ చిత్రంలో నల్ల నాగప్ప అనే ఒక పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. పవన్ కళ్యాణ్ చేస్తున్న పోలీస్ ఆఫీసర్ పాత్రను ఢీ కొట్టే ఒక బలమైన వ్యక్తిగా పార్తిబన్ కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.


మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని నిర్మిస్తున్నారు. గతంలో డైరెక్టర్ హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా ఎలాంటి రికార్డులను తిరగా రాసిందో చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా కూడా అలాంటి రికార్డులను తిరగరాస్తుందని అభిమానులు భావిస్తున్నారు. మరి ట్రైలర్ తో ఏ విధంగా సినిమా అంచనాలను పెంచేస్తారో చూడాలి మరి. చివరిగా గత ఏడాది ఓజి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు పవన్ కళ్యాణ్. ఒకవైపు రాజకీయాలు మరొకవైపు సినిమా షూటింగ్లలో పాల్గొంటూ అభిమానులను అలరిస్తున్నారు పవన్ కళ్యాణ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: