ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..డ్రాగన్ సినిమా టీజర్ ఎప్పుడంటే..?
కేజిఎఫ్, సలార్ వంటి చిత్రాలతో మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్,ఎన్టీఆర్ తో సినిమా అనౌన్స్మెంట్ చేసినప్పటి నుంచి ఎన్టీఆర్ ని ఎలా చూపించబోతున్నారని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మే 20వ తేదీన ఎన్టీఆర్ పుట్టినరోజు ఉండడంతో ఆరోజు అభిమానులకు డబుల్ ధమాకా ఉండేలా మేకర్స్ ప్లాన్ చేసినట్లుగా సమాచారం. ఎన్టీఆర్ బర్త్డే కంటే ఒకరోజు ముందుగానే మే 19వ తేదీన ఒక పవర్ ఫుల్ టీజర్ ని విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారట. ఈ టీజర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా డిజైన్ చేయబోతున్నట్లు వినిపిస్తోంది.
గతంలో ఎన్నడు లేని విధంగా ఎన్టీఆర్ లుక్ ఇందులో ఉండబోతుందని, అది కూడా ఊర మాస్ లెవల్లో చూపించబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో టాక్ వినిపిస్తోంది. 2026 జూన్ 25న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాని విడుదల చేసేలా movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ వారు ఇదివరకే ప్రకటించారు. అలాగే ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా రాబోయే టీజర్ ద్వారా ఈ సినిమా కథ ఎలా ఉండబోతోందనే హింట్ ఇవ్వబోతున్నారు. అలాగే టైటిల్ పైన కూడా సరైన క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరి ఎన్టీఆర్ డ్రాగన్ సినిమా గురించి వినిపిస్తున్న వార్తలపై ఎంత నిజం ఉందో తెలియాలి అంటే అప్పటివరకు ఆగాల్సిందే. లేకపోతే చిత్ర బృందం ఏదైనా అఫీషియల్ గా ప్రకటిస్తారేమో చూడాలి.