కార్తికేయ 3 పై ఎట్టకేలకు గుడ్ న్యూస్ చెప్పిన హీరో నిఖిల్..!
దాదాపుగా ఈ సినిమా పూర్తి చేయడానికి మూడేళ్ల సమయం తీసుకున్నారు నిఖిల్. ఇంత లేటుగా వచ్చినా కూడా సినిమా పర్ఫెక్ట్ గా రావాలన్నదే కారణమని అలాగే సిజి వర్క్ ,పోస్ట్ ప్రొడక్షన్ వల్ల ఈ సినిమా ఆలస్యమైందని తెలిపారు. నిన్నటి రోజున విడుదలైన టీజర్ అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. ముఖ్యంగా స్టార్ హీరోలు సైతం(మహేశ్ , రామ్ చరణ్, ప్రభాస్)తమ సినిమా కోసం పెడుతున్న డెడికేషన్ తనను ఇన్స్పైర్గా చేసిందంటూ తెలిపారు. స్వయంభు సినిమాలో వారియర్ క్యారెక్టర్ చేయడానికి సుమారుగా 45 రోజులు ట్రైనింగ్ తీసుకున్నానని తెలిపారు.
ఈ సినిమా కథను నమ్మి చాలా కష్టపడ్డానని ఒక రియల్ స్టోరీని చూపించబోతున్నామంటూ తెలిపారు. ఇందులో హీరోయిన్స్ గా నభా నటేష్, సంయుక్త మీనన్ నటిస్తున్నారు. స్వయంభు టీజర్ ఈవెంట్లో కార్తికేయ 3 పై మాట్లాడుతూ ఈ ఏడాది చివరిలో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని, వచ్చే ఏడాదిలో విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తామని తెలిపారు. అలాగే స్వయంభు పార్ట్ 2 కూడా ఉంటుందంటు తెలియజేశారు. ఫిబ్రవరి 13వ తేదీన స్వయంభు సినిమా విడుదల కావాల్సి ఉండగా , కొన్ని కారణాల చేత వాయిదా పడింది. మరి ఈ సినిమాని సమ్మర్ క్యాష్ చేసుకోవడానికి ఏప్రిల్ 10వ తేదీన విడుదల చేయబోతున్నట్లు వినిపిస్తున్నాయి. మరి విడుదల తేదీ పైన ట్రైలర్ తో క్లారిటీ ఇస్తారేమో చూడాలి.