హీరోయిన్ డ్రస్సులపై వీకే. నరేష్ షాకింగ్ కామెంట్స్..!

Divya
గత కొంతకాలంగా టాలీవుడ్ హీరోయిన్స్ దుస్తులపైన చర్చ జరుగుతూనే ఉంది. ఈ చర్చ ఇప్పుడప్పుడే ముగిసేలా కనిపించడం లేదు. ప్రముఖ నటుడు శివాజీ మొదలుపెట్టిన ఈ వివాదం ఈ మధ్య కాస్త సర్దుమునిగింది అనుకుంటే.. ఇటువంటి తరుణంలో నటుడు నరేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరొకసారి వైరల్ గా మారుతున్నాయి. ఇటీవల హే భగవాన్ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో పాల్గొన్న నరేష్ స్టేజ్ మీద హీరోయిన్ శివాని నగరం తో చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ఈ వేడుకలో హీరోయిన్ శివానిని పలకరిస్తూ.. ఆమెను హగ్ చేసుకుందామని వెళ్లాను.. ఒక్కసారిగా ఆగిపోయి మళ్ళీ వెనక్కి వచ్చాను, ఆమె పద్ధతిగా చీర కట్టుకొని ఉండడాన్ని చూపిస్తూ అందరూ శివాజీ చేసినట్టే వింటున్నారంటున్నారు. అందుకే ఈ మధ్య వేడుకలలో ఎక్కడ చూసినా కూడా మహిళలందరూ చీరలోనే కనిపిస్తున్నారంటూ సెటైరికల్ గా మాట్లాడారు. అందరూ ఇలా పద్ధతిగా ఉంటే హగ్ చేసుకోవడం కూడా చాలా కష్టమే, అందుకే తాను హాగ్ చేసుకోవడం లేదంటూ, హీరోయిన్, యాంకర్ స్రవంతిని ఒకరినొకరు కౌగిలించుకోమంటూ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.


అయితే ఈ విషయం మాత్రం ఇప్పుడు మరొక వివాదానికి దారి తీస్తోంది. గతంలో శివాజీ చేసిన వ్యాఖ్యల పైన చాలామంది సెలబ్రిటీలు చేసిన కామెంట్స్ ఎంతలా మారాయో తెలిసిందే. అయితే ఇప్పుడు నరేష్ కావాలని శివాజీ పేరును ప్రస్తావిస్తూ మరి చీరకట్టు గురించి ఇలా మాట్లాడడం హగ్గులతో ముడిపెట్టడంతో పలువురు నేటిజన్స్  పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది ఈ వ్యాఖ్యలు కామెడీగా చూస్తూ ఉంటే మరి కొంతమంది హీరోయిన్ల దుస్తులు అంశాన్ని మళ్లీ వివాదంలోకి నరేష్ లాగారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం వీకే నరేష్ చేసిన ఈ కామెంట్ కి సంబంధించి వీడియో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: