ఎవరైనా సరే సమాజంలో ఎదుగుతున్నారంటే కచ్చితంగా వారిపై లేనిపోని తప్పుడు ప్రచారాలు జరుగుతూ ఉంటాయి. కొంత మంది సినిమాల్లో ఎదిగే వారిపై ఇలాంటి ప్రచారం చేస్తూ ఉంటే మరి కొంత మంది రాజకీయాల్లో ఎదుగుతున్న వారిపై ఈ ప్రచారం చేస్తూ ఉంటారు. అయితే తాజాగా సినిమాల్లో సక్సెస్ అయి రాజకీయాల్లోకి వచ్చిన తమిళ నటుడు విజయ్ తలపతి పై ఇలాంటి ఒక ప్రచారమే జరుగుతుంది. అదేంటంటే విజయ్ తలపతి దగ్గర దాదాపు పది సంవత్సరాలు నమ్మకంగా పనిచేసిన ఓ వ్యక్తి ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది. మరి ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు.. ఆయన చెప్పిన మాటలు ఏంటి అనేది చూస్తే..
విజయ్ తలపతి దగ్గర దాదాపు 10 సంవత్సరాలు ఎంతో విశ్వసనీయంగా పనిచేసిన ఓ వ్యక్తి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని మాట్లాడుతూ.. విజయ్ దగ్గర నేను 10 సంవత్సరాలు విశ్వాసంగా పని చేశాను. కానీ ఒకరోజు ఆయన తినే ఆహారంలో వెంట్రుక వచ్చింది అనే కోపంతో నన్ను ఛాతిపై తన్ని బయటకి గెంటేశారు.ఆ చిన్న తప్పుకి అలా నన్ను గెంటేసి అవమానించారు. పదేళ్లుగా ఆయన దగ్గర విశ్వాసంగా పని చేసినందుకు నాకు మంచి బహుమతి ఇచ్చారు. ఆ రోజు ఆయన చేసిన పనికి ప్రస్తుతం నాకు ఒక పూట తినడానికి తిండి కూడా లేని పరిస్థితి ఏర్పడింది. విజయ్ ఆరోజు కనికరం లేకుండా నా పట్ల ప్రవర్తించారు. ఆయన చేసిన పని వల్లే నాకు ఈ రోజు ఈ దుస్థితి వచ్చింది అంటూ ఆ వ్యక్తి కన్నీళ్లు పెట్టుకుంటూ మాట్లాడారు.
ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవ్వడంతో విజయ్ తలపతి అభిమానుల్లో, కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది.కొంతమందేమో విజయ్ దళపతి ప్రవర్తన చూసి మరీ ఇలాంటోడా.. కనీసం 10 సంవత్సరాలుగా పనిచేసే పనివాడి పట్ల కాసింత కనికరం చూపించలేడా.. తన్ని బయటికి గెంటేస్తాడా.. మరీ ఇంత మూర్ఖుడా అంటూ కామెంట్లు పెడుతుంటే..మరి కొంత మందేమో విజయ్ రాజకీయాల్లో ఎదగడం నచ్చకే కొంతమంది ఆయనపై ఇలాంటి ఆరోపణలు చేయిస్తున్నారని, ఇలాంటి ఆరోపణలు సమాజంలో ఎదుగుతున్న ఎంతో మంది ఎదుర్కొన్నారని, అదంతా దుష్ప్రచారమే అంటూ కొట్టి పారేస్తున్నారు. అయితే ఇప్పటివరకు విజయ్ పై ఆ వ్యక్తి చేసిన ఆరోపణలపై విజయ్ గానీ, విజయ్ టీం గానీ స్పందించలేదు. మరి ఆ వ్యక్తి చేసిన కామెంట్లు విజయ్ రాజకీయ జీవితానికి ఏమైనా ఇబ్బంది కలిగిస్తాయా అనేది చూడాలి.