టాక్సిక్: రూ.120 కోట్ల రైట్స్ పై.. దిల్ రాజు షాకింగ్ స్టేట్మెంట్..!
ఇటీవలే మార్కండేయ సినిమా గ్లింప్స్ లాంచింగ్ ఈవెంట్లో భాగంగా టాక్సీక్ సినిమా రైట్స్ పైన అక్కడ ప్రస్తావించగా.. మీరు రూ .120 కోట్ల రూపాయలు పెట్టి సినిమా తీసుకోవడం అందరికీ ఆశ్చర్యానికి గురి చేసింది అది కేవలం సినిమా పబ్లిక్ స్టంట్ అంటూ కామెంట్స్ వస్తున్నాయి. అందుకే మీరు పోస్టర్ ను విడుదల చేశారా? దీనిపైన ఎలా స్పందిస్తారని అడగగా? ఈ విషయం పైన దిల్ రాజు మాట్లాడుతూ. అలా డౌట్ పడేవారి కోసం తాను ఒక పని చేస్తాను చిత్ర నిర్మాతలకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత బ్యాంక్ స్టేట్మెంట్ ని చూపిస్తానంటూ తెలియజేశారు.
అది చూసిన తర్వాత అయినా నమ్ముతారేమో అని దిల్ రాజు సమాధానాన్ని చెప్పేశారు. దీన్ని బట్టి చూస్తూ ఉంటే టాక్సిక్ హక్కులు కొనుగోలు భారీ ధరకే కొనుగోలు చేసినట్లుగా అర్థమవుతుంది. దిల్ రాజు పేరు మీదుగా దిల్ రాజు డ్రీమ్స్ అనే ఒక కొత్త బ్యానర్ ని స్థాపించారు. ఇందులో యంగ్ టాలెంట్ ని ఎంకరేజ్ చేయాలని ఉద్దేశంతోనే మొదలు పెట్టామని తొలి సినిమాగా మార్కండేయ సినిమాని తెరకెక్కిస్తున్నాము. ఈ సినిమా 2027 శివరాత్రికి విడుదల చేయబోతున్నామని ఈ సినిమా ఒక మైథాలజికల్ థ్రిల్లర్ సినిమా అంటూ తెలిపారు. ఇందులో హీరోగా విక్రాంత్ నటించారని తెలిపారు.