కపుల్ ఫ్రెండ్లీ రివ్యూ: సంతోష్ శోభన్ ప్రేమ కథతో మెప్పించారా..?
స్టోరీ విషయానికి వస్తే:
శివ (సంతోష్ శోభన్) నెల్లూరులో ఇంటీరియర్ డిజైన్ నేర్చుకొని ఉద్యోగం కోసం వెతుకుతూ చెన్నైకి వెళ్తారు. ఎన్ని ఏళ్ళు గడిచినా కూడా తనని తాను నిరూపించుకునే అవకాశం లభించకపోవడంతో పార్ట్ టైమ్ బైక్ రైడర్గా పనిచేస్తుంటారు. ఆ ప్రయాణంలో అనుకోకుండా మిత్ర (మానస వారణాసి) తో పరిచయం ఏర్పడుతుంది. అలా ఇద్దరి కథ కూడా ఒకేలా ఉండడంతో ప్రతిచోట కూడా ఇద్దరికీ నిరాశ ఎదురవుతుంది. మిత్ర ఇంటికి వెళ్తే పెళ్లి చేస్తారని భయంతో ఇంట్లో వాళ్లకి ఉద్యోగం చేస్తున్నానని చెప్పి చెన్నై ఉంటుంది. అయితే ఇలా శివ, మిత్ర జీవితాలు అనుకోకుండా ఒకే చోటుకి చేరుతాయి. వివాహం కాకముందే ఒకే ఇంట్లో ఇద్దరు కలిసి జీవించాల్సి వస్తుంది. ఆ తర్వాత వీరిద్దరి మధ్య ఏమైంది? మిత్ర తన జీవితంలోకి వచ్చాక శివా జీవితం శివ జీవితం ఎలా మారింది? వీరిద్దరి మధ్య చిగురించిన ప్రేమ ఎన్ని మలుపులు తిరుగుతుంది అనేది సినిమా కథ.
సినిమా ఎలా ఉందంటే:
కొన్ని బంధాలు ,ప్రయాణాలు ఎప్పుడూ ఎలా ఆగిపోతాయో చెప్పలేం. అందుకే రేపటి గురించి ఆలోచించకుండా ఈ క్షణమే అన్నట్లుగా ప్రతిరోజు ప్రేమించిన వారికి దగ్గరగానే ఉంటూ వారి జ్ఞాపకాలతో గడిపేయాలి. కపుల్స్ ఫ్రెండ్లీ సినిమా స్టోరీ ఇలాంటిదే..జీవితంలో ఎలాంటి హోప్స్ లేని ఒక కుర్రాడు జీవితంలోకి అమ్మాయి వస్తే ఏం జరుగుతుంది? వారిద్దరి జీవితాలలో ఎలాంటి మార్పులు వచ్చాయి అనే విషయాన్ని చాలా క్లుప్తంగా చూపించారు డైరెక్టర్. ఈ సినిమాని చాలా బాగోద్వేగమైన అంశంగా చూపించే ప్రయత్నం చేశారు. కానీ ఈ సినిమా నెమ్మదిగా సాగిన అనుభూతి కలిగిస్తుంది. అలాగే యూత్ కి బాగా మనసు హత్తుకొనేలా ఉంటుంది. శివ లవ్ బ్రేకప్ స్టోరీ సినిమా స్టోరీ మొదలవుతుంది. ఆ వెంటనే మిత్ర పాత్రను పరిచయం చేయగా, ఆ తర్వాత మిత్ర హీరో జీవితంలోకి ఎలా వచ్చింది అనే విషయాన్ని కాస్త వేగంగా చూపించారు. మిత్ర తన తెలివితేటలతో శివా జీవితాన్ని ఎలా మార్చేసింది అతని కోరుకున్న దిశగా కెరియర్ని మిత్ర నడిపించిన తీరు, ఈ ప్రయాణంలో ఇద్దరు ప్రేమలో పడడం వంటివి అద్భుతంగా ఉన్నాయి. మొదటి భాగం సరదాగా సాగిన కథ రెండవ భాగం నుంచి పూర్తిగా ఎమోషనల్ గా ఆకట్టుకుంటుంది. కపుల్ ఫ్రెండ్లీ సినిమా గీతాంజలి, ఓయ్ వంటి చిత్రాలను గుర్తుకు చేస్తాయి. క్లైమాక్స్ ఊహకు తగ్గట్టుగానే ఉన్నప్పటికీ బాగోద్వేగాలతో ఎమోషనల్ గా ఆకట్టుకుంది.
ఎవరెవరు ఎలా నటించారంటే:
శివ పాత్రలో హీరో సంతోష్ శోభన్ అద్భుతంగా నటించారు. తన నటన ,లుక్స్ పరంగా అన్ని సహజంగానే కనిపించాయి. ఇంటర్వెల్ తర్వాత వచ్చేసి సీన్స్ చాలా ఎమోషనల్ ప్రతి ఒక్కరిని హత్తుకునేలా ఉంటాయి. మిత్రగా మానస వారణాసి నాచురల్ నటనతో కట్టిపడేసింది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా చూడముచ్చటగానే ఉంటుంది. కమెడియన్ గా యోగి బాబును పెట్టుకున్న కామెడీ పండించే అంశం ఈ సినిమాలో పెద్దగా కనిపించలేదు. మిగిలిన నటీనటులు ఎవరికి వారు వారి పాత్రలో లీనమై నటించారు.
బలాలు:
సంతోష్, మానస యాక్టింగ్
రెండవ భాగంలోని ఎమోషనల్ సీన్స్
కీలకమైన సీన్స్
బలహీనతలు:
కథలో కొత్తదనం లేకపోవడం
నెమ్మదిగా సాగే కథనం
రేటింగ్:
2.6/5