రూమర్స్ కి దిమ్మ తిరిగే సమాధానం చెప్పిన రాజాసాబ్ బ్యూటీ..!
మానవిక మోహనన్ తో పాటుగా నిధి అగర్వాల్ ,రిద్ది కుమార్ హీరోయిన్స్ గా నటించారు. ఈ చిత్రంలో మాళవికా ఒక యాక్షన్ ఎపిసోడ్ లో కనిపిస్తుంది. అయితే ఈ స్టంట్ తాను చేయలేదని ఆమెకు బదులుగా డూప్ ఉపయోగించారని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ట్రోల్ అయ్యింది. ఈ విషయం పైన మరోసారి రాజా సాబ్ సినిమాపై నెగిటివ్ కామెంట్స్ వినిపించడంతో ఈ రూమర్స్ పైన మాళవిక స్పందించింది. ముఖ్యంగా తానే స్వయంగా రోప్ సహాయంతో కష్టమైన ఫైట్స్ చేశానంటూ వీడియోలను ప్రూప్ తోనే షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ.
నేను నా స్టంట్స్ నేనే చేశాను సినిమాలలో రిస్కీ షాట్స్ చేసేటప్పుడు లేకపోతే రిహార్సల్ కోసమే ప్రొఫెషనల్ స్టంట్ డబుల్స్ ఉపయోగించడం సర్వసాధారణం అంటూ తెలియజేసింది. కానీ మీరు చూసిన మా సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్ లో నేనే స్వయంగా పాల్గొన్ననని తెలియజేసింది. తనకి స్టంట్స్ చేయడం అంటే చాలా ఇష్టం అందుకే ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాను అంటూ తెలిపింది మాళవిక. ఈ వీడియోలు, ఫోటోలు చూసిన అభిమానుల సైతం తెగ వైరల్ గా చేస్తున్నారు. ఇకనైనా ఇకమీదట ట్రోల్స్ చేసేవారు ఆపండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ట్విట్ వైరల్ గా మారింది.