సీతా పయనం రివ్యూ: అర్జున్ దర్శకత్వం వహించిన సినిమా ఎలా ఉందంటే..?

Divya
యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా ఎన్నో చిత్రాలలో నటించారు. హీరోగా అవకాశాలు తగ్గడంతో పలు సినిమాలలో విలన్ గానే కాకుండా పలు విభిన్నమైన పాత్రలలో నటిస్తూ ఆల్రౌండర్ గా పేరు సంపాదించారు. డైరెక్టర్ గా కూడా ఎన్నో చిత్రాలను చేసి విజయాలను అందుకున్న అర్జున్ ఈసారి తన కూతురు ఐశ్వర్య అర్జున్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తూ తీసిన చిత్ర సీతాపయనం. ఈ చిత్రం తెలుగు ,కన్నడ భాషలలో విడుదల కాగా మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు ఒకసారి చూద్దాం.


స్టోరీ విషయానికి వస్తే:.
సీత (ఐశ్వర్య అర్జున్) తల్లి మరణించడంతో తెలివైన అమ్మాయిగా చిన్న వయసు నుంచే తండ్రి రాజేంద్రప్రసాద్ (సత్యరాజ్) లోనే తన అమ్మను చూసుకుంటూ ఉంటుంది. అయితే తాను వివాహం చేసుకొని వెళ్ళిపోతే తండ్రి ఒంటరిగా ఉండిపోతారని భయంతో పెళ్లిపై కూడా మక్కువ చూపదు. షెఫ్ కావడంతో సీత తన కారులో ఒంటరిగా హైదరాబాద్ ప్రయాణిస్తుంది. అలా ప్రయాణిస్తున్న మార్గ మధ్యలో  కారు చెడిపోయిందని సీతను లిఫ్ట్ అడుగుతారు అభి (నిరంజన్) పలు షరతులతో లిఫ్ట్ ఇచ్చి ఊరి దగ్గర దించేస్తుంది సీత.. అయితే అలా ఇద్దరు కలిసి ప్రయాణం చేసిన సమయంలో వారికి ఎవరెవరు ఎదురయ్యారు? ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయి? ఆ ప్రయాణం తర్వాత తిరిగి అభిని సీత ఎందుకు కలుసుకోవలసి వస్తుంది ? అసలు అభి ఎవరు ? సీత ఎందుకు కలవాలనుకుంటుందనే విషయం తెలియాలి అంటే వెండితెర పైన చూడాల్సిందే.


సినిమా ఎలా ఉందంటే:
అర్జున్ సినిమా ప్రమోషన్స్ లో కూడా తన కూతురికి ఒక బహుమతిగా ఈ సినిమా చేసి ఇచ్చానని ప్రచారం చేశారు. తన కూతురు ఐశ్వర్య పైన ఉన్న ప్రేమను ఈ సినిమాలో కూడా చూపించారు. ముఖ్యంగా తండ్రీ కూతుర్ల అనుబంధం నేపథ్యంలో సాగే కథ ,బంధాలు, బంధుత్వాలు, ఆనందం వంటివి ఈ సినిమాలో చాలా చూపించారు. ప్రయాణం నేపథ్యంలో సాగే కథలో మధ్యలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనలు అందరిని ఆకట్టుకుంటాయి. ఇక్కడే సినిమా చాలా సహజమైన అనుభూతిని కలిగిస్తుంది. ముఖ్యంగా హీరోయిన్ పెట్టే కండిషన్స్ అందుకు హీరో ఒప్పుకొని చేసే సీన్స్ కూడా చాలా సరదాగా అనిపిస్తాయి. హైదరాబాదులో తనకి ఎదురైన సంఘటన వల్ల హీరోయిన్ తీసుకొనే నిర్ణయం కథ మలుపును తిప్పుతుంది. ఇక రెండవ భాగంలో హీరో ఊరు కుటుంబ నేపథ్యంలో సాగే సీన్స్, అలాగే ధ్రువ్ సర్జా అతిధి పాత్రలో చేసే యాక్షన్ , ప్రకాష్ రాజ్ బంధాల గురించి చెప్పడం అన్నీ కూడా రెండవ భాగంలో హైలెట్ గా ఉన్నాయి. సాధారణ క్లైమాక్స్ తోనే సినిమా ముగుస్తుంది.


ఎలా నటించారంటే:
ఐశ్వర్య అర్జున్, నిరంజన్ కొత్త వారే అయినా కూడా ఇద్దరు ఎంతో అద్భుతంగా నటించారు. సినిమాలో ఐశ్వర్య నటన అద్భుతంగా ఉంటుంది. ఆమె పాత్ర సినిమాలో ఎక్కువగా కనిపిస్తుంది. ఎమోషనల్ సీన్స్ లో కూడా అద్భుతంగా నటించింది. సీనియర్ నటీనటులు ఎవరికి వారు అద్భుతంగా నటించారు.అర్జున్ కూడా అతిధి పాత్రలో కనిపించారు. డైరెక్టర్ గా అర్జున్ తీసిన స్వచ్ఛమైన కథని ఈ సినిమాగా తెరకెక్కించారు.


బలాలు:
ప్రయాణ నేపథ్యంలో సాగే కథ
నటీనటులు

మైనస్:
కొత్తదనం లేని కథ
అక్కడక్కడ సాగదీత ఎమోషనల్ సీన్స్.

రేటింగ్:
2.5/5

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: