ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. అదుర్స్ 2 కి సిద్ధం..!

Divya
జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లోనే ఏదైనా విభిన్నమైన పాత్ర చేశారు అంటే అది డైరెక్టర్ వివి.వినాయక్ దర్శకత్వంలో వచ్చిన అదుర్స్ సినిమానే అని చెప్పవచ్చు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికీ సోషల్ మీడియాలో బ్రహ్మానందం, ఎన్టీఆర్ మిమ్స్ ఎంతగా వైరల్ గా మారుతుంటాయో చెప్పాల్సిన పని లేదు. ఎన్టీఆర్ కి జోడిగా నయనతార, షిలా నటించారు. ఎన్టీఆర్ కెరియర్ లోనే గ్రేటెస్ట్ హిట్గా నిలిచింది అదుర్స్ సినిమా. ఈ చిత్రాన్ని వల్లభనేని వంశీ నిర్మించారు. 2017 లో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకున్నది.


ముఖ్యంగా ఎన్టీఆర్ డబుల్ రోల్ లో చాలా అద్భుతంగా నటించారు. ఇప్పటికీ ఎన్టీఆర్ కి ఈ సినిమా మాస్టర్ పీస్ అని అభిమానులు చెబుతూ ఉంటారు. చారి, బట్టు మధ్య వచ్చే కామెడీ సీన్స్ కూడా వేరే లెవల్లో ఉంటాయి. ఇన్ని రోజులకు అదుర్స్ సినిమా సీక్వెల్  రాబోతున్నట్లు వినిపిస్తున్నాయి. తాజాగా ఒక సినిమా ఈవెంట్లో కోన వెంకట్ మాట్లాడుతూ..అదుర్స్ సినిమా సీక్వెల్ కి సంబంధించి పలు విషయాలను తెలియజేశారు. ఎన్టీఆర్ ప్రస్తుతం రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇటీవలే వివి.వినాయక్ ను కలిస్తే అదుర్స్ సీక్వెల్ స్క్రిప్ట్ గురించి అడిగినట్లుగా తెలియజేశారు.


స్క్రిప్ట్ రెడీ అయ్యిందని అయితే ఎన్టీఆర్ ఫ్రీగా అయిన తర్వాత కలిసి ఈ ప్రాజెక్టు గురించి డిస్కషన్ చేసిన తర్వాతే ఏ విషయం అయినా చెబుతామని తెలిపారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారుతోంది. అదుర్స్ చిత్రానికి కోన వెంకట్  కథ అందించారు. దీంతో ఇప్పుడు ఆయనే అదుర్స్ 2 సినిమా పైన అప్డేట్ ఇవ్వడంతో అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు, కామెడీ లవర్స్ కూడా మరింత ఆనందాన్ని తెలియజేస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో పేరు సంపాదించిన ఎన్టీఆర్ ఇప్పుడు అదుర్స్ 2 ఓకే చెబితే పాన్ ఇండియా లెవెల్ లోనే విడుదల చేస్తారేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: