హీరో ప్రభాస్ కి గాయం.. ఎక్కడ ఏం జరిగిందంటే..?

Divya
టాలీవుడ్ లో పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించిన ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో వైవిద్యమైన పాత్రలలో అభిమానుల మెప్పిస్తూ బిజీగా ఉన్న ప్రభాస్ కు గాయాలైనట్టుగా టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ నటిస్తున్న చిత్రాలలో ఫౌజీ సినిమా కూడా ఒకటి. ఈ చిత్రాన్ని డైరెక్టర్ హనురాగవపూడి తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా కి సంబంధించి ఒక కీలకమైన సీన్ చిత్రీకరిస్తున్నప్పుడు ప్రభాస్ కు గాయాలైనట్లుగా తెలిసింది. కాని ఇందుకు సంబంధించి అధికారికంగా చిత్రబృందం ఇప్పటివరకు ఎక్కడ ప్రకటించలేదు.



ఫౌజీ సినిమాలోని హార్స్ రైడింగ్ చేస్తున్న సమయంలో ఈ గాయాలైనట్లుగా సినీ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. అనంతరం చిత్ర బృందం అలర్ట్ అయ్యి వెంటనే ప్రభాస్ కు ప్రధమ చికిత్స చేయించారట. ఈ గాయాలు పై పైన తగలడంతో ఒకటి లేదా రెండు రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యం సూచించినట్లు సమాచారం. దీన్ని బట్టి చూస్తే మరో రెండు రోజుల తర్వాత ప్రభాస్ సినిమా షూటింగ్లో పాల్గొంటారని టాక్ ఉంది. ప్రస్తుతం ఫౌజీ సినిమాకి సంబంధించి ఒక కీలకమైన సీన్స్ చిత్రీకరిస్తున్నారు. మరొకవైపు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రాబోతున్న స్పిరిట్ సినిమా షూటింగ్లో కూడా బిజీగా ఉన్నారు. స్పిరిట్ సినిమా కంటే ఫౌజీ సినిమానే ముందుగా విడుదల చేయాలని అందుకే సినిమా షూటింగ్లో కాస్త దూకుడు చూపిస్తున్నట్టు కనిపిస్తోంది. అలాగే రాబోయే రోజుల్లో కల్కి 2 సినిమా షూటింగ్లో పాల్గొనే అవకాశం ఉన్నది. ఈ మూడు చిత్రాలలో ఏదో ఒక సినిమా షూటింగ్ అయిపోతే సలార్ 2 సినిమా షూటింగ్లో పాల్గొనే అవకాశం ఉన్నది.




ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రాజా సాబ్ మిక్స్డ్ టాక్ సంపాదించుకుంది. మొదటిసారి హర్రర్, కామెడీ జోనర్లో నటించారు ప్రభాస్. డైరెక్టర్ మారుతి సరికొత్త కథాంశంతో ప్రేక్షకులను అలరించిన మిక్స్డ్ టాక్ రావడంతో కలెక్షన్స్ పెద్దగా రాబట్ట లేకపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: