దురంధర్ సినిమాలో ఛాన్స్ పై నిజం చెప్పిన నాగార్జున..!
గత కొద్దిరోజులుగా నాగార్జునకు సంబంధించి ఒక న్యూస్ అయితే వైరల్ గా మారింది. బాలీవుడ్లో భారీ విజయాన్ని అందుకున్న దురంధర్ సినిమాలో అవకాశం వచ్చిందని ఆ అవకాశాన్ని ఆయన వదులుకున్నారనే విధంగా వినిపించాయి. ఈ విషయం పైన నాగార్జున స్పందిస్తూ అక్షయ్ ఖన్నా పాత్రను మీకు ఆఫర్ చేశారట నిజమేనా? అంటూ ప్రశ్నించగా.. అందుకు నాగార్జున లేదు నాకు ఎవరూ కూడా ఏ పాత్ర చేయమని అడగలేదు. కానీ దురంధర్ సినిమా మాత్రం మంచి విజయాన్ని అందుకుంది.డైరెక్టర్ ఆదిత్య ధర్ కూడా అద్భుతంగా తీశారు. ఆయన తీసిన ఉరి సినిమా కూడా తనకు చాలా ఇష్టమని తెలియజేశారు.
దురంధర్ సినిమాలో కూడా ప్రతి ఒక్కరు చాలా అద్భుతంగా నటించారు. అక్షయ్ ఖన్నా నటనే ఈ సినిమాకి ప్రధాన బలం, ఈ సినిమా సీక్వెల్ కోసం తాను కూడా ఎదురు చేస్తున్నానని తెలియజేశారు. ప్రస్తుతం నాగార్జున చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దురంధర్ సినిమా బాలీవుడ్ లో రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించారు. సుమారుగా రూ 1300 కోట్ల రూపాయలు రాబట్టింది ఈ సినిమా. నాగార్జున 100వ సినిమా విషయంపై కూడా అభిమానులు చాలా ఎక్సైటింగ్ గానే ఎదురు చూస్తున్నారు. ఈ విషయం పైన కూడా నాగార్జున మాట్లాడుతూ తన వందవ సినిమా కోసం చాలానే కష్టపడుతున్నాం, ఎటువంటి తొందరపాటు లేకుండా ఆలస్యంగా వచ్చిన అభిమానులను మెప్పించేలా ఉండాలని చూస్తున్నామని తెలిపారు.