ఏంటి అల్లు శిరీష్ నయనిక కంటే ముందే మరో అమ్మాయిని ప్రేమించారా.. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు..ఎందుకు మొదటి ప్రేమ బ్రేకప్ అయ్యింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.రీసెంట్ గానే అల్లు శిరీష్ పెళ్లి సందడి మొదలైంది. పసుపు కొట్టే కార్యక్రమం నుండి పెళ్లి సందడి స్టార్ట్ చేశారు. ఇక ఈ మధ్యకాలంలో అల్లు శిరీష్ బ్యాచిలర్ పార్టీని కూడా గ్రాండ్గా ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే.ఇదిలా ఉంటే మార్చి 6న అల్లు శిరీష్ నయనికల పెళ్లి జరగబోతుంది. ఇక మార్చ్ 6న ఇప్పటికే అల్లు ఫ్యామిలీలో ఓ పెళ్లి జరిగింది.వాళ్ళు ఎవరంటే అల్లు అర్జున్ స్నేహ రెడ్డి..అన్న వదినల పెళ్లిరోజునే శిరీష్ కూడా తన పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది.
ఇదిలా ఉంటే అల్లు శిరీష్ మొదటి ప్రేమ నయనికతోనే అనుకుంటే పప్పులో కాలేసినట్టే.ఎందుకంటే గతంలో అల్లు శిరీష్ ప్రదీప్ హోస్ట్ గా చేసిన కొంచెం టచ్ లో ఉంటే చెప్తా అనే షోలో తన ఫస్ట్ లవ్ గురించి చెప్పుకొచ్చారు. అల్లు శిరీష్ తన ఫస్ట్ లవ్ గురించి మాట్లాడుతూ..నేను ముంబైలో చదువుకునే సమయంలో నాకు ఓ గర్ల్ ఫ్రెండ్ ఉండేది.ఆమె ఓ మోడల్.అయితే వీకెండ్ వచ్చిందంటే చాలు ఆ అమ్మాయి పబ్బులు,పార్టీలు అంటూ నన్ను తెగ తిప్పేది.ఇక ఆ అమ్మాయి ముందు నేను ఎక్కడా కూడా తగ్గకుండా రీచ్నెస్ ని మెయింటైన్ చేస్తూ ఉండేవాడిని. అలా చాలా డబ్బులు ఖర్చు పెట్టించుకుంది.
చివరికి ఇంటికి రావడానికి ఫ్లైట్లో వస్తానని చెప్పి మా వాళ్ళ దగ్గర ఎనిమిది వేలు తీసుకొని డబ్బులు గర్ల్ ఫ్రెండ్ కి మిగిల్చుకోవడం కోసం 1500 పెట్టి బస్ జర్నీ లో ఇంటికి వెళ్లేవాడిని. అలా ఆరు నెలలకే ఆ అమ్మాయి నాతో పెట్టించే ఖర్చులు భరించలేకపోయాను.ఆమెను మెయింటైన్ చేయలేకపోయాను. చివరికి బ్రేకప్ అయ్యింది అంటూ అల్లు శిరీష్ ఆ షో ఫస్ట్ లవ్ గురించి చెప్పుకొచ్చారు. అయితే అప్పటి వీడియో అల్లు శిరీష్ పెళ్లి వేళ మరోసారి వైరల్ గా మారడంతో అల్లు శిరీష్ ఫస్ట్ లవ్ నయనిక కాదా.. బాంబే మోడలా అంటూ న్యూస్ వైరల్ అవుతుంది.