జై హనుమాన్ సినిమాలో రాముడిగా టాలీవుడ్ స్టార్ హీరో.. ఎవరంటే..?
జై హనుమాన్ సినిమాలో రిషబ్ శెట్టితో పాటుగా మరో టాలీవుడ్ హీరో నటించబోతున్నారు. ఆ హీరో ఎవరో కాదు రానా దగ్గుబాటి. ఇందులో హనుమంతుడిగా కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే మరికొన్ని నివేదికల ప్రకారం రానా విలన్ గా కూడా నటించబోతున్నట్లు వినిపిస్తున్నాయి. రానా ఎలాంటి పాత్రలోనైనా సరే ఒదిగిపోయి నటించగలిగే హీరోగా పేరు సంపాదించారు. అలా ఇప్పటికే ఎంతోమంది హీరోల చిత్రాలలో అతిధి పాత్రలలో కూడా కనిపించి బాగా ఆకట్టుకున్నారు.
గడిచిన కొన్ని నెలల క్రితం హీరో రానా తన టాక్ షోలో భాగంగా రిషబ్ శెట్టి స్వస్థలం కెరడాకి వెళ్లి మరి రిషిబ్ శెట్టిని ఇంటర్వ్యూ కూడా చేయడం జరిగింది. అప్పటినుంచి వీరిద్దరి మధ్య మంచి స్నేహబంధం ఏర్పడడంతో ఇప్పుడు ఇద్దరు కలిసి నటించబోతున్నట్లు తెలిసింది. గతంలో వచ్చిన హనుమాన్ సినిమాకి సీక్వెల్ గానే జై హనుమాన్ సినిమాని తెరకెక్కిస్తున్నారు. హనుమాన్ సినిమాలో తేజ సజ్జ హీరోగా నటించగా, వరలక్ష్మి శరత్ కుమార్ కీలకమైన పాత్రలో నటించింది. హీరోయిన్ గా అమృత అయ్యర్ నటించింది. విలన్ గా వినయ్ రాయ్ నటించారు. మరి జై హనుమాన్ సినిమాలో ఎవరెవరు నటిస్తారని విషయంపై ఇంకా చిత్ర బృందం అధికారికంగా క్లారిటీ ఇస్తుందేమో చూడాలి. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్లోనే తెరకెక్కిస్తున్నారు.