2026 దసరా: బాక్సాఫీస్ వద్ద బిగ్ ఫైట్..బరిలో ఎవరెవరంటే..?

Divya
టాలీవుడ్ లో ప్రతి పండుగకు కూడా ఎన్నో చిత్రాలు విడుదలవుతుంటాయి. ముఖ్యంగా కొన్ని పండుగలకు ప్రత్యేకించి స్టార్ హీరోల చిత్రాలు విడుదల చేసేలా ప్లాన్ చేస్తుంటారు. అలా దసరా బరిలో ఈసారి బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద పోటీనే కనిపిస్తోంది. 2026 దసరా కి అగ్ర హీరోల నుంచి యంగ్ హీరోస్ వరకు తమ సినిమాలను విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికి పలువురు మేకర్స్ కూడా తమ విడుదల తేదీ పైన అధికారికంగా ప్రకటించారు.


నందమూరి ,బాలకృష్ణ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రాబోతున్న చిత్రం NBK -111 ఈ చిత్రాన్ని కూడా దసరా బరిలోనే విడుదల చేయబోతున్నారు. వీరి కాంబినేషన్లో వీరసింహారెడ్డి సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకున్నది. డైరెక్టర్ హనురాఘవపూడి, ప్రభాస్ కాంబినేషన్లో రాబోతున్న పీరియాడికల్ చిత్రం ఫౌజీ. ఈ చిత్రాన్ని అక్టోబర్ 16న దసరా కానుకగా విడుదల చేయబోతున్నారు. అలాగే మరో యంగ్ హీరో రోషన్ మేక తన తదుపరి చిత్రాన్ని ఏమో ఏమో ఇది చిత్రంతో దసరా కానుకగా రాబోతున్నారు.అలాగే డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో ఈ సినిమా రాబోతోంది. సినిమా టీజర్ ను విడుదల చేయగా పాజిటివ్ రెస్పాన్స్ లభించింది.దీంతో ఈ సినిమాని కూడా దసరా కానుకగా విడుదల చేయబోతున్నారు.  

వీటితో పాటుగా కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ నటిస్తున్న శేయోన్ సినిమాని కూడా అక్టోబర్లో విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని కమలహాసన్ నిర్మిస్తుండగా గ్రామీణ నేపథ్యంలో సాగే సినిమా. ఇక ఇవే కాకుండా చాలా ప్రాజెక్టులు సైతం దసరా కి విడుదల చేయడానికి సిద్ధమవుతున్నాయి. మరి దసరా బరిలో  ఏ ఏ సినిమాలు నిలుస్తాయో, ఏ ఏ సినిమాలు పోస్ట్ ఫోన్ అవుతాయో చూడాలి మరి. మొత్తానికి ఈసారి దసరా బరిలో కూడా బడా చిత్రాల పోటీ తప్పడం లేదు. మరి ఎవరు విజేతగా నిలుస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: