నిర్మాతలపై దిల్ రాజు షాకింగ్ కామెంట్స్.. మరి అలానా..?
ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది . సినీ పరిశ్రమను పెట్టి పోషించేది వారే కాబట్టి హీరో, హీరోయిన్స్ దగ్గర నుంచి టెక్నికల్ నిపుణులు, లైట్ బాయ్స్ వరకు ప్రతి ఒక్కరు వారిని దేవుళ్ళుగా భావించేవారు. సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి దిగ్గజ నటులు ఒకానొక సందర్భాలలో కింద కూర్చుంటే కొంతమంది ప్రొడ్యూసర్లు వాళ్ల ముందే కుర్చీలో కూర్చునేవారు అంతటి గౌరవం ఆనాటి రోజులలో నిర్మాతలకు లభించేది. కానీ ఇప్పుడు అలా లేదంటూ తెలియజేశారు దిల్ రాజు. మనోవేదనతో స్టార్ డైరెక్టర్లకు కూడా భయపడే రోజులు వచ్చాయని, వందల కోట్ల రూపాయలు పెడుతున్న పుచ్చుకునే వారిదే పై చేయి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని దిల్ రాజు మాట్లాడారు.
ఎక్కడైనా సరే ఇచ్చేవాడి చేయి పైనుండడం తీసుకునే వాడి చేయి కిందుండడం సహజమే, కానీ ఇండస్ట్రీలో మాత్రం ఇచ్చే వారి చేయికంటే పుచ్చుకునే వారి చేయే ఎక్కువగా పైనుంటాయంటూ మాట్లాడారు. ఒకప్పుడు నిర్మాతలు అందరిని శాసించేవారు, కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి డబ్బులు తీసుకున్న వాళ్లే ఇచ్చిన వాళ్లను కూడా శాసించే స్థాయికి వచ్చేసారంటూ తెలిపారు. ఈ విషయాన్ని చాలామందికి వినడానికి చేదుగానే ఉన్న ఇదే నిజం అంటూ కొంత మంది సమర్థిస్తున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో నిర్మాతల మధ్య రేస్ నడుస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే దిల్ రాజు ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారని పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.