మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఈమధ్యనే మరోసారి తండ్రి అయిన సంగతి మనకు తెలిసిందే.మొదట 2023లో ఉపాసన రాంచరణ్ లకి క్లింకార జన్మించగా..2026 లో ఈ జంట కవల పిల్లలకు జన్మనిచ్చింది. రీసెంట్గా ఉపాసన ప్రసవించగా కవల పిల్లలు పుట్టారు. ఈ పుట్టిన కవల పిల్లలకు బారసాల చేసి శివరామ్, అన్విరా దేవి అని నామకరణం చేశారు మెగా ఫ్యామిలీ. అలా వారసుడు పుట్టలేదని తెగ బాధ పడిపోతున్న చిరంజీవికి మనవడు పుట్టడంతో ఆయన సంతోషం అంతా ఇంతా కాదు. ఇదిలా ఉంటే చాలామంది హీరోలకు సంబంధించిన చిన్నప్పటి సీక్రెట్లు అప్పుడప్పుడు వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు బయట పెడుతూ ఉంటారు. అయితే తాజాగా రాంచరణ్ కి సంబంధించిన ఓ సీక్రెట్ విషయం కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అదేంటంటే.. చిన్నతనంలో రామ్ చరణ్ సందులోకి వెళ్లి మరీ ఆ పని చేసే వారట. మరి ఇంతకీ రాంచరణ్ సందులోకి వెళ్లి చేసిన ఆ పనేంటో ఇప్పుడు తెలుసుకుందాం. గతంలో సురేఖ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమయంలో తన కొడుకు రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ.. రామ్ చరణ్ చిన్నప్పటినుండి చాలా పద్ధతిగా ఉండేవాడు. కాస్త అల్లరి కూడా చేసేవాడు కాదు. కానీ టీనేజ్ కి వచ్చాక కాస్త అల్లరి చేయడం మొదలు పెట్టాడు. ఇక వాడికి కిల్లీ తినడం అంటే చాలా ఇష్టం. కానీ కిల్లీ చిన్నపిల్లలు తినకూడదు అని చెప్పడంతో ఎవరికి తెలియకుండా సందులోకి వెళ్లి కిల్లీ తిని ఏమీ తెలియనట్టు వచ్చి నిల్చునేవాడు.
అలా చాలాసార్లు దొంగ చాటుగా సందులోకి వెళ్లి కిల్లీ తిన్న సందర్భాలు ఉన్నాయి అంటూ సురేఖ రామ్ చరణ్ కి సంబంధించిన సీక్రెట్ విషయాన్ని బయట పెట్టింది.. ఇక ఈ విషయం నెట్టింట వైరల్ గా మారడంతో చరణ్ కి ఇప్పటికీ ఆ అలవాటు ఉందా.. లేక మానేశారా.. అంటూ కామెంట్స్ పెడుతున్నారు.ఇక రాంచరణ్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఈయన ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు డైరెక్షన్ లో పెద్ది సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన అన్ని అప్డేట్స్ మెగా ఫ్యాన్స్ కి కిక్కిచ్చాయి.ఇక మార్చిలో విడుదల అవుతుంది అనుకున్న ఈ సినిమా వాయిదా పడింది.