ఏంటి రానా చావు అంచుల్లో ఉన్నారా.. ఆయన చనిపోవడానికి 30 శాతం అవకాశం ఉందా.. అందుకే సినిమాల అడ్వాన్స్ తిరిగి ఇచ్చేసారా.. ఇంతకీ రానా చనిపోయే వార్తలకు సంబంధించిన న్యూస్ నిజమేనా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. రీసెంట్గా రానా రియా చక్రవర్తికి ఇచ్చిన పాడ్ కాస్ట్ లో తన గురించి కొన్ని సంచలన విషయాలు బయట పెట్టారు రానా ఆ పాడ్ కాస్ట్ లో మాట్లాడుతూ.. నాకు మంచి హిట్ సినిమా పడ్డాక ఆరోగ్య సమస్యలు ఉన్నాయని బయటపడింది. నాకున్న ఆ పెద్ద అనారోగ్య సమస్యల నుండి బయట పడాలనేదే నా ముందున్న లక్ష్యం.
మొదట ఈ విషయం తెలిసి షాక్ అయ్యాను. నా రెండు కిడ్నీలు పాడయ్యాయని, 70% స్ట్రోక్, బ్రెయిన్ హేవరేజ్ అయ్యే అవకాశం కూడా ఉందని డాక్టర్లు హెచ్చరించారు. 30% చనిపోయే అవకాశం ఉందని కూడా తెలిపారు. ఆ టైంలో అమెరికాకి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకున్నాను. ట్రీట్మెంట్ తీసుకుంటున్న సమయంలో నా ధ్యాస మొత్తం బాడీ మీదే ఉండేది. అదే సమయంలో నేను ఒక రెజ్లర్ కథతో సినిమా చేయాల్సి ఉంది. కానీ ఆ టైంలో నా బాడీ ఫిజిక్ సినిమాకి సరిపోదని ఇచ్చిన అడ్వాన్స్ తిరిగి ఇచ్చేసాను.
ఇంకా మిగతా సినిమాలకు సంబంధించిన అడ్వాన్స్ కూడా తిరిగి ఇచ్చేశాను.. అనారోగ్యంతో ఉన్నప్పుడు నా బాడీని చూసి చాలా బాధపడిపోయాను. ట్రీట్మెంట్ వల్ల మందులు వేసుకోవడం వల్ల నా బాడీ చాలా వరకు మారిపోయింది. ఆ మార్పులను అంగీకరించాను. నా ముందున్న పెద్ద లక్ష్యం బతకడం మాత్రమే.. కానీ సినిమాలే మళ్లీ నన్ను బతికించాయి. హీరోలా మీ ముందుకు తిరిగి వచ్చాను. అమెరికాలో ట్రీట్మెంట్ తీసుకున్న ఏడాదికి ఇండియాకి వచ్చాను అంటూ రానా దగ్గుబాటి గతంలో తాను ఎదుర్కొన్న అతిపెద్ద ఆరోగ్య సమస్య గురించి బయటపెట్టారు.