టాక్సిక్ టీజర్: దుమ్ము దులిపేస్తున్న యష్..!

Divya
కేజిఎఫ్ చిత్రం ద్వారా భారీ పాపులారిటీ సంపాదించుకున్న హీరో యష్ ఆ తర్వాత కేజిఎఫ్ 2 చిత్రంతో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సంపాదించారు. ఈ చిత్రాలను డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాలతో తెలుగులో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న యష్ తన తదుపరిచిత్రం టాక్సిక్ సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రతి అప్డేట్ కూడా భారీ అంచనాలను పెంచేసింది. డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. మార్చి 19న 2026 లో ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు.


తాజాగా టాక్సిక్ సినిమా నుంచి టీజర్ ని విడుదల చేయగా, టీజర్ అభిమానులను బాగా ఆకట్టుకున్నట్లు కనిపిస్తోంది. హీరో యష్ లుక్స్, యాక్టింగ్ విజువల్స్ అన్నీ కూడా హాలీవుడ్ రేంజ్ లో కనిపిస్తున్నాయి. ఇందులో యష్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నట్లుగా టీజర్ చూస్తే కనిపిస్తోంది. అలాగే ఇందులో చూపించిన వైలెన్స్ మరింత హైగా ఉంది. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తోనే నిర్మిస్తున్నారు కేవీఎన్ నిర్మాణ సంస్థ. ఈ చిత్రానికి డైరెక్టర్ గీతూతో పాటుగా యష్ కూడా ఈ సినిమాకి కథను రాశారు.



కొన్ని వెబ్ సైట్లలో వస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా స్టోరీ 1940-70 మధ్య జరిగే ఎటువంటి గోవా బ్యాక్ డ్రాప్ లో సాగే ఒక పవర్ఫుల్ యాక్షన్ , థ్రిల్లర్ సినిమా కథ అన్నట్లుగా తెలుస్తోంది. సముద్ర తీరం వెనుక దాగి ఉన్న చీకటి ప్రపంచం, రక్తపాతం వెన్నుపోటు వంటి చుట్టూ ఈ సినిమా సాగుతూ ఉంటుంది. అలాంటి చోట తన సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించుకుంటారనేది ఈ సినిమా స్టోరీ. మరి భారీ అంచనాల మధ్య విడుదల కాబోతున్న ఈ సినిమా ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందో చూడాలి మరి. యష్ సినిమాకి పోటీగా చాలానే సినిమాలు విడుదలవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: