పుష్ప 2: సంధ్య థియేటర్ కేసులో కీలక పరిణామం..!

Divya
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం పుష్ప 2. ఈ చిత్రాన్ని డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించగా, రష్మిక హీరోయిన్గా నటించింది. పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా హైదరాబాదులోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తోకిసలాట గురించి అందరికీ తెలిసిందే. ఈ తొక్కిసలాటలో ఒకరు ప్రాణాలు పోగా మరొకరు ఇప్పటికీ ప్రాణాలతో పోరాటం చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఘటన పైన ఛార్జ్ షీట్ కూడా ఫైల్ అయింది.


అల్లు అర్జున్ తో పాటుగా 23 మంది పైన అభియోగాలు నమోదు చేస్తూ ఛార్జ్ షీట్ కూడా వేశారు. థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ తొక్కిసలాట జరిగినట్లుగా పోలీసులు సైతం నిర్ధారించారు. అయితే ఈ కేసులో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఛార్జ్ షీట్ ను నాంపల్లి కోర్టు తాజాగా తిప్పి పంపినట్లు తెలుస్తోంది. అయితే గతంలో కూడా ఇలాగే ఒకసారి తిప్పి పంపడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు కూడా దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో లోపాలు ఉన్నట్లుగా కోర్టు గుర్తించింది.. సీడీలు, పెన్ డ్రైవ్ లు, హార్డ్ డిస్క్  వంటి వాటిని జతపరచక పోవడంతో ఇప్పుడు మరొకసారి ఛార్జ్ షీట్ ను రిటర్న్ చేసింది కోర్టు.


2024 డిసెంబర్ 4న పుష్ప 2 సినిమా భారీ స్థాయిలో విడుదలయ్యింది. ఈ సినిమా బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ్ కింద పడి తీవ్రమైన అస్వస్థకు గురయ్యారు. దీంతో శ్రీతేజ్ ఆరోగ్యం కుదుటపడడం కోసం చాలామంది సెలబ్రిటీలు విరాళం కూడా అందించారు. అలాగే అల్లు కుటుంబం కూడా అండగా నిలిచారు. తెలంగాణ ప్రభుత్వం కూడా శ్రీ తేజ్ ఆరోగ్య విషయంపై అన్ని విధాలుగా అండగా ఉంటామంటూ ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: