విజయ్ రష్మిక పెళ్లిపై మాజీ ప్రియుడి ఫ్రెండ్ షాకింగ్ కామెంట్స్..సోషల్ మీడియాలో రచ్చ.!

Pandrala Sravanthi
ఎట్టకేలకు విజయ్ దేవరకొండ రష్మిక మందన్నాలు ఫిబ్రవరి 26న పెళ్లి పీటలెక్కబోతున్నారు. రాజస్థాన్లోని ఉదయ్ పూర్ ప్యాలెస్ వేదికగా వీరి పెళ్లి జరగబోతుంది.అలాగే మార్చి 4న ఈ జంట ఎంగేజ్మెంట్ ని హైదరాబాదులో అంగరంగ వైభవంగా చేసుకోబోతున్నట్టు సమాచారం. అయితే పెళ్లికి అత్యంత సన్నిహితుల్ని మాత్రమే ఆహ్వానించినప్పటికీ రిసెప్షన్ కి మాత్రం అందర్నీ పిలిచి గ్రాండ్ గా చేసుకోబోతున్నారట. ఇప్పటికే పెళ్లి కార్డులు పంచడం కూడా మొదలెట్టేశాడు విజయ్ దేవరకొండ. ఇదిలా ఉంటే తాజాగా విజయ్ దేవరకొండ రష్మిక మందన్నా ల పెళ్లిపై రష్మిక మాజీ ప్రియుడి ఫ్రెండ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన మాట్లాడిన వీడియో నెట్టింట వైరల్ గా మారడంతో చాలామంది రష్మిక అభిమానులు ఆయన్ని తిట్టిపోస్తున్నారు. 


మరి ఇంతకీ రష్మిక మాజీ ప్రియుడి ఫ్రెండ్ మాట్లాడిన మాటలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. రష్మిక మొదట కన్నడ హీరో రక్షిత్ శెట్టిని పెళ్లి చేసుకోవాలనుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. కానీ సడన్గా వీరి ఎంగేజ్మెంట్ బ్రేక్ అయింది.ఆ తర్వాత ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు. అయితే తాజాగా రష్మిక పెళ్లి వేళ రక్షిత్ శెట్టి ఫ్రెండ్ ప్రమోద్ శెట్టి సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్మిక పెళ్లికి మిమ్మల్ని పిలిచారా అని అడగగా.. ఇప్పటివరకు రష్మిక పెళ్లి కార్డు మాకు అందలేదు.పెళ్లి పిలుపు కూడా రాలేదు. ఒకవేళ రష్మిక మమ్మల్ని పిలిస్తే ఖచ్చితంగా పెళ్లికి వెళ్తాం.కానీ ఆమె మమ్మల్ని పిలవదు.. అయినా రక్షిత్ శెట్టి చాక్లెట్ తినే పిల్లవాడు ఏమీ కాదు.ప్రస్తుతం రక్షిత్ తన సినిమాల్లో తాను బిజీగా ఉన్నాడు.


రష్మికని పెళ్లి చేసుకోనందుకు ఆయన ఏమి బాధపడడం లేదు అనే విషయం ఆయన ఆత్మీయులందరికీ తెలుసు అంటూ ప్రమోద్ శెట్టి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ప్రమోద్ శెట్టి మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ గా మారడంతో చాలామంది రష్మిక ఫ్యాన్స్ ఏకిపారేస్తున్నారు. రష్మికని నీ ఫ్రెండ్ పెట్టిన టార్చర్ వల్లే కదా ఆమె ఎంగేజ్మెంట్ ని రద్దు చేసుకుంది.ఇప్పటికే ఆమెని చాలాసార్లు ట్రోల్ చేశారు. ఇంకా ఆమెను వదిలి పెట్టరా అంటూ మండి పడుతున్నారు. అంతేకాదు పెళ్లి శుభలేఖ అందలేదు.. పెళ్లి పిలుపు రాలేదు అనే వ్యాఖ్యలపై కూడా క్లారిటీ ఇస్తూ.. అసలు మాజీ  లవర్స్ ని ఎవరైనా పెళ్లికి ఆహ్వానిస్తారా అంటూ ఏకీపారేస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: