ఆ క్షణం కోసమే వెయిట్ చేస్తున్నా.. ప్రేమపై ప్రభాస్ ఓపెన్ కామెంట్స్..!

Pandrala Sravanthi
ప్రభాస్ 46 ఏళ్ళు దాటిన పెళ్లి చేసుకొని బ్యాచిలర్.. ఈయన పెళ్లి పై చాలాసార్లు చాలా ప్రచారాలే జరిగినప్పటికీ ఏది నిజం కాలేదు. అయితే తాజాగా ఆయన కపుల్ ఫ్రెండ్లీ అనే చిత్ర యూనిట్ తో కలిసి ఇంటర్వ్యూ ఇచ్చిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.ఈ చిత్ర యూనిట్ తో సంభాషణ జరిగిన సమయం లో ఆయన ఫస్ట్ లవ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.. అయితే ప్రభాస్ ఏ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఖచ్చితంగా ఆయన ప్రేమ, పెళ్లి గురించి ప్రశ్నలు ఎదురవుతూ ఉంటాయి.ఇందులో భాగంగానే తాజాగా కపుల్ ఫ్రెండ్లీ టీం తో పాల్గొన్న ఇంటర్వ్యూలో కూడా ఈ సినిమాల్లో నటించిన హీరోయిన్ల లో ఒకరు ప్రేమపై మీ అభిప్రాయం ఏంటి అని ప్రశ్నించింది.


దీనికి ప్రభాస్ ఈ విషయం నా పర్సనల్ అని చెబుతూనే అసలు విషయాన్ని చెప్పేశారు.. ప్రభాస్ మాట్లాడుతూ.. నేను ప్రేమ లో పడే సమయం కోసమే ఎదురు చూస్తున్నాను.నిజానికి నాక్కూడా లవ్ లో పడాలని ఉంది. అందులో ఉండే అద్భుతమైన అనుభూతి ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఉంది.ఆ సమయం కోసం వేచి చూస్తున్నా అంటూ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రభాస్ మాట్లాడిన మాటలకి చాలామంది నవ్వుకుంటున్నారు.


50 ఏళ్లు దగ్గర పడుతున్న వయసు లో ప్రేమ లో పడాలి అనుకోవడం ఏంటి.. ఇప్పటికే మీ వయసులో ఉన్న వాళ్ళందరూ పెళ్లిళ్లు చేసుకొని పిల్లలకు జన్మనిచ్చారు.ఆ పిల్లలు కూడా సినిమాల్లో నటించే స్థాయికి ఎదిగారు. కానీ మీరు ఇంకా ప్రేమలో పడటం దగ్గరే ఆగిపోయారు అంటూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. ఇక ప్రభాస్ ఈ ఇంటర్వ్యూలో చాలా స్టైలిష్ గా కనిపించారు.అలాగే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ లుక్ ప్రభాస్ నెక్స్ట్ నటించబోతున్న ఫౌజీ సినిమాలోని లుక్ అంటూ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: