లక్కీ ఛాన్స్ కొట్టేసిన మీనాక్షి చౌదరి.. దశతిరిగినట్టేనా..?
2006లో అక్షయ్ కుమార్, గోవిందా,పరేష్ రావల్ కాంబినేషన్లో వచ్చిన భాగమ్ భాగ్ సినిమా విడుదల భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు దాదాపుగా రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ ఈ సినిమాకి సీక్వెల్ గా రాజ్ శాండిల్య తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం పక్కా కామెడీ ఎంటర్టైన్మెంట్గా తెరకెక్కించేలా ప్లాన్ చేస్తున్నారు. ఇందులోనే మీనాక్షి చౌదరి ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నట్లు బాలీవుడ్లో వినిపిస్తున్నాయి. అలాగే విలక్షణమైన నటుడుగా పేరు సంపాదించిన మనోజ్ బాజ్ పాయ్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపిస్తూ ఉండడం గమనార్హం.
అంతేకాకుండా బిగ్ బాస్ ద్వారా భారీ పాపులారిటీ సంపాదించుకున్న ఆయేషా ఖాన్ కూడా ఇందులో కనిపించబోతోంది. మరో సీనియర్ నటుడు పరేష్ రావల్ ఇందులో ఈసారి ద్విపాత్రాభినయంలో కనిపించబోతున్నారు. మరి ఇలాంటి సినిమాతో మీనాక్షి చౌదరి బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఆమె దశ తిరుగుతుందని అభిమానులు భావిస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీలోకి అతి తక్కువ సమయంలోనే ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోలకు జోడిగా నటించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు హిందీలో కూడా పాగ వేయాలని చూస్తోంది. మరి ఒకవేళ అన్ని అనుకున్నట్టు కుదిరితే మీనాక్షి చౌదరి దశ తిరగడం ఖాయమని పలువురు నెటిజెన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఏడాది అనగనగా ఒక రాజు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. అలాగే వృషకర్మ అనే చిత్రంలో కూడా నటిస్తోంది.