మర్యాదగా మాట్లాడండి? హీరో విశ్వక్ సెన్ వార్నింగ్..!
కొన్ని సంఘటనలను ఉదాహరణగా తీసుకొని దాని గురించి ఏకవచనంతో మాట్లాడడంతో హీరో విశ్వక్ సెన్ ఫైర్ అయ్యారు.. రిపోర్టర్ ఒక ప్రశ్న అడుగుతూ.. ఇంతమంది జనాలను తీసుకొస్తున్నారు కదా! థియేటర్ మేనేజ్మెంట్, సీటింగ్ కెపాసిటీ ఎంత ఉంటుందో తెలుసా? అంతమందిని ఎలా రానిస్తున్నారు అని అడగగా? అందుకు విశ్వక్ సమాధానాన్ని చెబుతూ అది థియేటర్ మేనేజ్మెంట్ చూసుకుంటుంది కదా! మీకు ఎందుకు? ఇవన్నీ ఎందుకు సినిమా గురించి మాట్లాడుకోవచ్చు కదా అని విశ్వక్ సెన్ సమాధానం ఇచ్చారు. అనంతరం రిపోర్టర్.. ఆడియో సరిగ్గా రావడం లేదు అలాంటప్పుడు మమ్మల్ని కెమెరాలు తీసుకొనిరామనడం ఎందుకు అటు ఫైర్ అవుతుంది రిపోర్టర్.
అప్పుడు విశ్వక్ కి కోపం వచ్చి అక్కా మొన్నేమో ఆ హీరో అలా తయారయ్యాడు ఇప్పుడేమో ఇలా తయారయ్యారంటూ మాట్లాడారని అంటారు. మీరు ఏమిటి గురించి చెబుతున్నారో క్లారిటీ ఇవ్వండి అని రిపోర్టర్ అడగగా.. విశ్వక్ ఫైర్ అవుతూ మొన్నేమో నాని అలా తయారయ్యాడు ఇప్పుడు నువ్వు ఇలా తయారయ్యావు ముందుగా మీరు మాకు మర్యాద ఇవ్వాలి కదా! మీతో వచ్చిన సమస్య ఏమిటంటే వేలు మా వైపు మీరు చూపిస్తారు. మేము మీ వైపు వేలు చూపించినప్పుడే అసలైన సమస్య మొదలవుతోంది అంటూ మాట్లాడే ముందు గారు అనే పదాన్ని ఉపయోగించండి అంటూ విశ్వక్ సెన్ ఫైర్ అయ్యారు.