నన్ను ఇండస్టి నుంచి గెంటేశారు.. ప్రియాంక చోప్రా సెన్సేషనల్ కామెంట్స్..!

Divya
బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించి ఇప్పుడు హాలీవుడ్ లో  పలు సినిమాలలో నటిస్తూ ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్ గా మారిపోయింది ప్రియాంక చోప్రా . ప్రస్తుతం మహేష్ బాబు నటిస్తున్న వారణాసి సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. అలాగే హాలీవుడ్ యాక్షన్ సినిమా ది బ్లఫ్ చిత్రం ఈనెల 25న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియాంక చోప్రా పలు ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకుంది.



ప్రియాంక చోప్రా మాట్లాడుతూ తాను ఎప్పుడూ కూడా బాలీవుడ్ ని వదిలి వెళ్లాలనుకోలేదు, కానీ అప్పట్లో హిందీ ఇండస్ట్రీ తన పైన ఉన్న రాజకీయాల వల్ల తనని ఒక మూలకు నెట్టేశారు. నాకు రావలసిన అవకాశాలను కూడా చాలామంది తగ్గించేశారు. నటిగా ఎదగాలని ఉన్నా సరే అక్కడ పరిస్థితులు తనకు సహకరించలేదని అలాంటి సమయంలోనే హాలీవుడ్ నుంచి వచ్చిన ఆఫర్ నాకి ఒక దారి చూపించిందని తన మనసులో మాటను బయటపెట్టింది ప్రియాంక చోప్రా.


అలా హాలీవుడ్ కి వెళ్లి సుమారుగా 12 ఏళ్లు దాటిపోయింది. అక్కడే స్టార్ గా ఎదిగానని తెలియజేసింది. అలాగే మళ్లీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇండియాకు తిరిగి రావడం పైన స్పందిస్తూ.. నేను మళ్ళీ ఇండియన్ సినిమాలలో నటించడానికి చాలా ఆసక్తికరంగా ఉన్నాను ముఖ్యంగా రాజమౌళి తెరకెక్కిస్తున్న వారణాసి సినిమా చేస్తూ ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంది. తెలుగు సినిమాల మేకింగ్ అక్కడ కల్చర్ అంటే నాకు చాలా ఇష్టం. అలాగే హాలీవుడ్, బాలీవుడ్ అనేవి తనకు రెండు కళ్ళు లాంటివి ఏ ఒక్క దాన్ని కూడా వదిలి ఇంకో దాన్ని ఎంచుకోలేనని క్లారిటీగా చెప్పేసింది ప్రియాంక చోప్రా. ప్రస్తుతం ప్రియాంక చోప్రా చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి వారణాసి సినిమా తరువాత ప్రియాంక చోప్రా కు మరిన్ని అవకాశాలు వెలుపడతాయేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: