అల్లు వారింట పెళ్లి.. పవన్ కు ఆహ్వానం..!

Divya
టాలీవుడ్ లో త్వరలోనే అల్లు కుటుంబంలో పెళ్లి భాజాలు మోగనున్నాయి. పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్ సోదరుడు హీరో అల్లు శిరీష్ త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ క్రమంలోనే శిరీష్ తన వివాహ ఆహ్వాన పత్రికను సైతం మెగా కుటుంబ సభ్యులకు స్వయంగా అందజేయడం జరిగింది. తాజాగా అల్లు శిరీష్, తన తండ్రి అల్లు అరవింద్, తల్లి నిర్మలమ్మతో కలిసి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లారు. అక్కడ పవన్ కళ్యాణ్ ఆయన భార్య అన్నా లెజినోవాను కలిసి మరి తమ వివాహానికి రావాలని ఆహ్వానించారు.


ఈ భేటీ అనంతరం అందుకు సంబంధించిన ఫోటోలను కూడా శిరీష్ తన సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. నాన్న, అమ్మతో కలిసి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు , లెజినోవా గారిని కలిసి నా వివాహానికి ఆహ్వానించాను, వారు కూడా నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. అంటూ ఒక ట్విట్ తెలియజేశారు. అలాగే మెగా బ్రదర్ నాగబాబు ఆయన భార్య పద్మజాను కూడా శిరీష ప్రత్యేకించి మరి వివాహ వేడుకకు ఆహ్వానించారు.


మెగా మరియు అల్లు కుటుంబ సభ్యుల మధ్య ఉన్న అనుబంధాన్ని మరొకసారి ఈ కలయికతో చాటిచెప్పేలా చేయబోతున్నారు. రాజకీయ, సినిమా రంగాలలో బిజీగా ఉన్నప్పటికీ అల్లు శిరీష్ ను ఎంతో ఆప్యాయంగా పలకరించారు పవన్ కళ్యాణ్. అలాగే అల్లు అరవింద్ దంపతులు కూడా మెగా సోదరులను కలవడం ఇక్కడ గమనార్హం. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో మెగా అభిమానులు కూడా ఆనందాన్ని తెలియజేస్తున్నారు. గత కొంతకాలంగా అల్లు శిరీష్ వివాహానికి సంబంధించి వార్తలు వినిపిస్తూ ఉండడంతో పాటుగా ఇప్పుడు స్వయంగా ఆయనే పెద్దలను ఆహ్వానిస్తూ ఉండడంతో ప్రశంసిస్తున్నారు. మరి వివాహము అనంతరం సినిమాలలో అల్లు శిరీష్ నటిస్తారా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: