నేడే రష్మిక - విజయ్ వివాహం..ముహూర్తం ఎన్ని గంటలకు అంటే..?
ఇప్పటికే వీరి వివాహం కోసం అటు ఇరువురి కుటుంబ సభ్యులు, సన్నిహితులు, ప్రముఖులు సైతం దిగినట్లు సమాచారం. అయితే రష్మిక, విజయ్ ఏ సమయానికి వివాహం చేసుకోబోతున్నారనే విషయంపై అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అత్యంత సన్నిహిత వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, గురువారం ఉదయం ఏడున్నర గంటలకు బరాత్ కారుక్రమం ఉంటుందని అది అయిపోయిన తర్వాత 10:10 నిమిషాలకు తెలుగు సాంప్రదాయమైన ప్రకారం రష్మిక, విజయ్ ల వివాహ ముహూర్త ఫిక్స్ చేసినట్లు సమాచారం.
అదే సమయానికి రష్మిక మెడలో విజయ్ మూడు ముళ్ళు వేయబోతున్నారు. ఆపైన అదే రోజు సాయంత్రం నాలుగు గంటల సమయంలో కన్నడలో కోడవ సాంప్రదాయం ప్రకారం మరొకసారి రష్మిక, విజయ్ ల వివాహం జరగనుంది. ఈ రెండు పద్ధతిలో కూడా వీరి వివాహం ఒకేరోజు చాలా గ్రాండ్ గా ప్లాన్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఇందుకు సంబంధించి కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్న ఇప్పటికే కొంతమంది సెలబ్రిటీలు కూడా వీరి వివాహ వేడుకలు పాల్గొన్నట్లుగా సోషల్ మీడియాలో కొన్ని పోస్టులను షేర్ చేశారు. మరి వివాహం అనంతరం పెళ్లి ఫోటోల కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చేస్తున్నారు.