ఎంగేజ్మెంట్ తో కాబోయే భార్యను పరిచయం చేసిన షణ్ముఖ్ జస్వంత్..!

Divya
షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లతో బాగా పాపులారిటీ సంపాదించుకున్న షణ్ముఖ్ జస్వంత్ బిగ్ బాస్ సీజన్ 5లోకి ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చారో ఆ తర్వాత మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. ప్రస్తుతం హీరోగా పలు సినిమాలలో చేస్తున్నప్పటికీ సరైన సక్సెస్ మాత్రం అందుకోలేకపోతున్నారు. గతంలో దీప్తి సునైనాతో ప్రేమలో ఉన్న షణ్ముఖ్ బిగ్ బాస్ తర్వాత బ్రేకప్ అయ్యింది.



గత కొన్ని నెలలుగా ఫేస్ చూపించకుండా ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నట్లుగా షణ్ముఖ్ పరిచయం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఎట్టకేలకు షణ్ముఖ్ తన ప్రేయసి ఫోటోని షేర్ చేశారు. షణ్ముఖ్ ప్రేయసి పేరు  వైష్ణవి చోడిశెట్టి ఆమెతో ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా ఎంగేజ్మెంట్  తేదీని స్పెషల్గా మెన్షన్ చేస్తూ చివరిలో దేవుడు ప్లాన్ రివిల్ అయింది అంటూ పోస్ట్ షేర్ చేశారు. అందుకు సంబంధించి కొన్ని ఫోటోలను కూడా షేర్ చేయగా అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.  ఈ ఫోటోలతో పాటుగా ఒక వీడియోను కూడా షేర్ చేయడంతో మరింత వైరల్ గా మారుతోంది. అలాగే షణ్ముఖ్ తన కాబోయే భార్యతో ఎంగేజ్మెంట్ వేడుకలలో ఇద్దరు కలిసి డాన్స్ చేసిన వీడియో షణ్ముఖ్ షేర్ చేశారు.


డాన్స్ చేస్తున్న వైష్ణవిని ఎత్తుకొని మరి షణ్ముఖ్ తిప్పుతూ చాలా ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నట్లుగా ఈ వీడియోలో కనిపిస్తోంది. వైష్ణవి కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్  అన్నట్లుగా వినిపిస్తోంది. సాధారణంగా బిగ్ బాస్ సెలబ్రిటీల ఇంట్లో చిన్న ఫంక్షన్ జరిగినా కనిపిస్తూ ఉంటారు లేదా  ఫోటోలకు తెగల లైక్స్ కామెంట్లతో చేస్తూ ఉంటారు. కానీ షణ్ముఖ్ ఫోటోలకు మాత్రం అలాంటివేవీ కనిపించలేదు. బిగ్ బాస్ హౌస్ వెళ్లి నష్టపోయిన వాళ్లలో షణ్ముఖ్ మొదటి స్థానంలో ఉంటారు. ఎందుకంటే ఆ సీజన్లో అడుగుపెట్టే సమయానికి తెలుగులో మంచి పాపులారిటీ సంపాదించారు. దీప్తి సునైన తో రిలేషన్ లో ఉన్న  షణ్ముఖ్ హౌస్ లో మరో యూట్యూబర్ సిరి హనుమంతుతో క్లోజ్ గా ఉండడంతో చాలా నెగెటివిటీ ఏర్పడింది. దీంతో విన్నర్ కావాల్సిన షణ్ముఖ్ రన్నారుగా మిగిలిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: