మన శంకవరప్రసాద్ గారు సినిమాపై పరుచూరి రివ్యూ..!
గోపాలకృష్ణ మాట్లాడుతూ.. మన శంకరవరప్రసాద్ గారు సినిమా టైటిల్ చాలా అందంగా ఉంది.ఈ సినిమా యాక్షన్ కామెడీ ఎంటర్టైన్మెంట్గా తెరకెక్కించారు. చిరంజీవిని పెట్టి యాక్షన్ లేకుండా అంత సాహసం చేస్తారా అనుకున్నాను.. ఆ తర్వాత యాక్షన్ కామెడీ అని అర్థమయింది. నరేష్, రాజేంద్రప్రసాద్ లతో తీసిన సినిమాల లాగా చిరంజీవితో కూడా కామెడీ సినిమా తీయడమంటే సాహసమే అని చెప్పవచ్చు. సినిమా ప్రారంభమైన మొదటి సన్నివేశంలో హీరో పాత్ర ఏంటి? అతడి గతం ఏంటి అనేది చెప్పేశారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి అంటేనే అపజయం ఎరుగని డైరెక్టర్ గా పేరు సంపాదించారు. ఈ చిత్రానికి చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదల నిర్మించారు. తన మొదటి సినిమాతోనే తండ్రిని మళ్లీ సింహాసనం పైన కూర్చోబెట్టింది.
ఈ చిత్రంలో వెంకటేష్ ,నయనతార కూడా ఎంటర్టైన్మెంట్ చేశారు. అందరూ కలిసి ప్రేక్షకులను అద్భుతమైన వినోదాత్మకమైన సినిమా అని అందించారని తెలిపారు. ఆడియన్స్ ను ఆకట్టుకుంది కాబట్టి ఈ సినిమాకి రూ.400 కోట్లు వచ్చిందని చిరంజీవి కెరియర్ లోని ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచిందని తెలిపారు.
మొదటి సన్నివేషంలో హీరో పాత్రకు పెళ్లి అయ్యిందని అలాగే భార్యకు దూరంగా ఉంటాడని చూపించారు. ఆ తర్వాత రెండవ సన్నివేశంలో హీరో పాత్ర తీరును చూపించారు. అలాగే టీవీ సీరియల్స్ తో తన కథను ముడిపెడుతు చూపించడం బాగుందని, హీరోకు చిన్న కామెడీ టీమ్.. ఆ టీమ్ లో మరొక హీరోయిన్ ని చూపించారు. అయితే ఆ అమ్మాయి కామెడీ టీమ్ లో ఎందుకు తీసుకున్నారనే విషయం చివరిలో చూపించారు. హీరో, హీరోయిన్ ఎప్పుడు కలుస్తారు? ఇలా ఎన్నో ప్రశ్నలు మనం కూడా వేసుకుంటాం.. కానీ మనకంటే ముందుగా రచయిత దర్శకులు వేసుకునే వాటిని చాలా పద్ధతి ప్రకారమే స్క్రీన్ పైన చూపించారు. మధ్య మధ్యలో ఎమోషన్స్ డైలాగ్ కూడా ఆకట్టుకున్నాయి. కామెడీ టీమ్ లో ఉన్న హీరోయిన్ ని వెంకటేష్ వివాహం చేసుకోవడం పెద్ద ట్విస్ట్. ఇంత అద్భుతమైన సినిమా తీసినందుకు అనిల్ రావిపూడి కి ధన్యవాదాలు, చిరంజీవి కి చిన్నపాటి సెల్యూట్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నారని తెలిపారు. చిరంజీవి అప్పటికి ఇప్పటికి అస్సలు ఏం తేడా లేదు అవే ఎనర్జీ అదే స్టెప్పులు ఎప్పటికీ మా చిరంజీవి అనిపించుకున్నారు అంటూ ప్రశంసలు కురిపించారు.