భర్త ఫోటోలను షేర్ చేస్తూ కన్నీళ్లు పెట్టుకున్నా రష్మిక..!
అయితే ఈ ఫోటోలలో మాత్రం ఒక్క ఫోటో చూసిన నేటిజన్స్ ఆశ్చర్యపోయేలా చేస్తోంది. ఆ ఫోటో ఏమిటంటే రష్మిక కన్నీళ్లు పెట్టుకున్న ఫోటోనే. తాను ఎంతగానో ప్రేమించిన వ్యక్తి ఇప్పుడు తన వాడు అవుతున్నాడనే సంతోషంతో రష్మిక కన్నీళ్లు పెట్టుకుంది. విజయ్ తన మెడలో తాళి కడుతున్న సమయంలో బాగోద్వేగాన్ని ఆపుకోలేక రష్మిక కన్నీరు పెట్టుకుంది. దీంతో రష్మిక, విజయ్ ని ఎంతగా ప్రేమిస్తోందో అనేదానికి నిదర్శనం అంటూ అభిమానులు సైతం కామెంట్స్ చేస్తున్నారు. అలాగే మరొక పక్క ఇన్స్టాగ్రామ్ లో రష్మిక ఎమోషనల్ పోస్ట్ ని షేర్ చేసింది.
ఇప్పుడు నేను మీకు నా భర్తను పరిచయం చేస్తున్నాను.. అతనే విజయ్ దేవరకొండ. నీలాంటి భర్త దొరకడం నిజంగా నా అదృష్టం ప్రతి ఎమోషనల్లో నువ్వు నాతో ఉన్నావు, నీ భార్యగా ఉండేందుకు నేను చాలా ఆత్రుతగా ఉన్నానని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రెండు సాంప్రదాయమైన పద్ధతిలో రష్మిక, విజయ్ దేవరకొండ వివాహం జరిగింది. ఇదంతా ఇలా ఉండాలి రష్మిక ,విజయ్ దేవరకొండ రిసెప్షన్ కార్యక్రమం హైదరాబాదులో మార్చి 4వ తేదీన జరగబోతోంది. ఈ వేడుకకు పలువురు సినీ సెలబ్రిటీలతోపాటు రాజకీయ నాయకులు కూడా హాజరు కాబోతున్నారు. మొత్తానికి అభిమానులు నేటిజన్స్ సైతం ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.