పెళ్లి అయ్యిందో లేదో.. నేరుగా మోదీ, అమిత్ షా భేటీకి విజయ్-రష్మిక.. అసలు కారణం ఏంటి?

Amruth kumar
టాలీవుడ్‌లో గత దశాబ్ద కాలంలో ఏ పెళ్లికి రానంత హైప్, ఏ జంటకు రానంత క్రేజ్ ఈ 'విరోష్' (VIROSH) వెడ్డింగ్‌కు లభించింది. ఎనిమిదేళ్ల రహస్య ప్రేమాయణం, వందలకొద్దీ రూమర్లు.. వీటన్నింటికీ చెక్ పెడుతూ 'రౌడీ స్టార్' విజయ్ దేవరకొండ, 'నేషనల్ క్రష్' రష్మిక మందన్న ఒక్కటయ్యారు. అయితే, పెళ్లి చేసుకున్న కొన్ని గంటలకే ఈ జంట చేసిన పని ఇప్పుడు దేశవ్యాప్తంగా సెన్సేషన్ అవుతోంది.



రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో అత్యంత ప్రైవేట్‌గా, రాయల్ స్టైల్‌లో పెళ్లి చేసుకున్న విజయ్-రష్మిక, నేరుగా దేశ రాజధాని ఢిల్లీలో ల్యాండ్ అయ్యారు. అక్కడ వారు సాక్షాత్తూ భారత ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు.విజయ్ పక్కా ట్రెడిషనల్ వైట్ కుర్తా పైజామాలో అదిరిపోయే 'దేవరకొండ' స్వాగ్‌తో కనిపించగా, రష్మిక నిండుగా చీర కట్టుకుని, కొత్త పెళ్లికూతురి కళతో మెరిసిపోయింది.తమ వివాహానికి సంబంధించి ప్రధాని పంపిన ప్రత్యేక లేఖకు ఈ జంట ధన్యవాదాలు తెలిపింది. మోదీ వారితో కొద్దిసేపు సరదాగా గడపడమే కాకుండా, కొత్త జీవితంపై ఆశీస్సులు అందించారు.



కేవలం ప్రధాని మాత్రమే కాదు, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా ఈ జంట మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా తీసిన ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్‌ను ఊపిరి తీసుకోనివ్వడం లేదు. ఒక సినిమా జంట పెళ్లి తర్వాత ఇలా నేరుగా దేశాధినేతలను కలవడం టాలీవుడ్ హిస్టరీలోనే ఒక రికార్డ్ అని చెప్పాలి.ఫిబ్రవరి 26న (నిన్న) రాజస్థాన్‌లోని ఉదయపూర్ ప్యాలెస్‌లో వీరి వివాహం అత్యంత వైభవంగా జరిగింది.ఉదయం తెలుగు సంప్రదాయం ప్రకారం, సాయంత్రం రష్మిక సొంత ఊరు కూర్గ్ (కొడవ) పద్ధతిలో రెండు సార్లు పెళ్లి చేసుకున్నారు.ముఖేష్ అంబానీ తన కుటుంబంతో హాజరై ఈ జంటను ఆశీర్వదించడం విశేషం.రాజస్థానీ రుచులతో పాటు హైదరాబాద్ దమ్ బిర్యానీని కూడా అతిథుల కోసం ప్రత్యేకంగా సిద్ధం చేశారు.



ఢిల్లీ పర్యటన ముగించుకుని ఈ జంట హైదరాబాద్ చేరుకోనున్నారు. మార్చి 4న గచ్చిబౌలిలో జరగబోయే 'గ్రాండ్ రిసెప్షన్' కోసం ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఈ వేడుకకు టాలీవుడ్, బాలీవుడ్ స్టార్ హీరోలతో పాటు రాజకీయ ప్రముఖులు భారీగా హాజరుకానున్నారు.విజయ్ దేవరకొండ అంటేనే వెరైటీ. తన పెళ్లిని కూడా ప్రపంచం మొత్తం మాట్లాడుకునేలా ప్లాన్ చేశాడు. ఎనిమిదేళ్ల క్రితం 'గీత గోవిందం'తో మొదలైన ఈ కెమిస్ట్రీ, నేడు ప్రధాని మోదీ ఆశీస్సుల వరకు చేరడం చూస్తుంటే.. "దేవరకొండ ఏం చేసినా అది ఒక ట్రెండ్" అని ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: